డెంగ్యూ జ్వరం అంటే ఎంతో ప్రమాదకరమైనదో చెప్పనక్కర్లేదు. సీజన్ మారుతుందంటే ఇది తొందరగా విజృంభిస్తుంది. డెంగ్యూతో చాలా మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెంగ్యూకు ఇంతవరకు నిర్ధిష్టమైన మందులు, చికిత్స విధానాలు లేవు. తాజాగా.. డెంగ్యూ వ్యాధికి తొలి ఔషధాన్ని ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కంపెనీ రూపొందించింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. డెంగ్యూకు వ్యతిరేకంగా యాంటీవైరల్ చర్యను ప్రదర్శించిన మొదటి పిల్ ఇది అని రాయిటర్స్ నివేదించింది.
Read Also: Shocking: కారు ఇంజిన్‌లో 6 అడుగుల కొండచిలువ.. షాకింగ్ వీడియో చూడండి..
‘జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ ప్రకారం.. క్లినికల్ ట్రయల్స్ లో 10 మంది వాలంటీర్లకు డెంగ్యూ వంటిదాన్ని ఇంజెక్ట్ చేయడానికి ముందు జే అండ్ జే అభివృద్ధి చేసిన డ్రగ్ డోస్‌ను అధిక మొత్తంలో ఇచ్చారు. 21 రోజుల పాటు నిరంతరంగా ఆ మందును కొనసాగించారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా అందులో ఆరుగురికి రక్తంలో డెంగ్యూ కనిపించలేదు. 85 రోజుల తర్వాత కూడా వారి రోగ నిరోధక వ్యవస్థలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు గుర్తించలేదని తేలింది.
Read Also: KP Nagarjuna Reddy: గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి జననీరాజనం
డెంగ్యూ జ్వరం వస్తే వెంటనే లక్షణాలు బయటపడవు. మోకాళ్లు, మోచేతుల్లో తీవ్ర నొప్పి, కండరాల నొప్పి కారణంగా దీనిని బ్రేక్ బోన్ ఫీవర్‌గా కూడా పిలుస్తుంటారు. ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో దీనిని బారినపడేవారు ఎక్కువగా ఉంటారు. ఏటా లక్షల మంది దీనిబారిన పడుతుండగా.. వ్యాధి ముదిరి వేలల్లో చనిపోతుంటారు. ఈ వ్యాధికి ఇప్పటి వరకు నిర్దిష్ట చికిత్స, ఔషధం లేదా వ్యాక్సిన్ తయారు చేయలేదు. దోమల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త జెరేమి ఫారర్ గతంలో చెప్పారు.