Male Contraceptive Injection: మగవారి కోసం కొత్త రకం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఇంజెక్షన్ సహాయంతో 99 శాతం గర్భాన్ని నివారించవచ్చని చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఏడేళ్ల ఇంటెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఈ ఇంజెక్షన్‌ను ఆమోదించారు. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సులభమని.. దీని సక్సెస్ రేట్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది. అందుకు సంబంధించి ICMR తన నివేదికను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించింది.
Read Also: Google Layoff: హై టాలెంటెడ్ ఉద్యోగులను కూడా వదలడం లేదు..
303 మంది వివాహితులు, సంపూర్ణ ఆరోగ్యవంతమైన పురుషులపై ICMR తమ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆ పరిశోధనలో వారికి RISUG అంటే రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ ఇంజెక్షన్ నాన్-హార్మోనల్ ఇంజెక్ట్ చేయదగిన గర్భనిరోధకంగా పని చేస్తుందని.. అంతేకాకుండా అవాంఛిత గర్భధారణను నివారించడంలో విజయవంతమవుతుందని ICMR చెబుతోంది. సాధారణంగా పురుషులు గర్భనిరోధకం కోసం వాసెక్టమీ లేదా కండోమ్స్ వాడుతుంటారు. అయితే ఐసీఎంఆర్ కొత్త పద్ధతిని డెవలప్ చేసింది. పురుషులకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. స్త్రీలు గర్భం దాల్చకుండా ఆ ఇంజెక్షన్ ను రూపొందించారు. ఈ ఇంజెక్షన్‌లో ప్రత్యేకత ఏమిటంటే.. ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ఇది 13 సంవత్సరాల వరకు ప్రభావవంతంగా పని చేస్తుంది. అంటే 13 సంవత్సరాల వరకు గర్భం రాకుండా నిరోధించవచ్చు. ఆ ఇంజెక్షన్ తో ఎటువంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవని, చాలా సురక్షితమైందని ఐసీఎంఆర్ వెల్లడించింది.
Read Also: TS BJP: తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ లకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహ రచన