health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు.. ఎందుకంటే ఏది కోల్పోయిన సంపాదించుకోగలం కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ఆరోగ్యానికి చాల ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వికులు. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విదాంగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తినే ఆహారం మారింది. అయితే ఆరోగ్యం బావుండాలి అంటే కొన్ని కూరగాల్ని తినక తప్పదు. అయితే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించే నేతి బీరకాయ గురించి ఇప్పుడు తీసుకుందాం. నేతి బీరకాయను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నేతి బీరకాయలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక అధిక బరువును నియంత్రిస్తుంది.
Read also:Geeta Madhuri: సింగర్ గీతా మాధురి విడాకులు.. నందు ఏమన్నాడంటే ?
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలానే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక రోగనిరోధక శక్తిని పెంచడానికి అలానే చర్మం కాంతిని మెరుగు పర్చడానికి నేతిబీరకాయ ఎంతగానో దోహద పడుతుంది. అలానే విటమిన్లు B1, B2 , B3 నేతిబీరకాయలో పుష్కలంగా ఉంటాయి. కనుక నేతిబీరకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలానే ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా ఉంచి ముడతలను తగ్గిస్తుంది. అలానే జుట్టు పెరుగుదలకు కూడా నేతి బీరకాయ దోహద పడుతుంది. ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్న ఈ నేతిబీరకాయను ఫ్రై, సలాడ్, కర్రీ ఇలా వివిధ రకాలుగా తీసుకోవచ్చు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..