మనలో చాలామంది బరువు తగ్గడానికి జ్యూస్లు ఎక్కువగా తాగుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ జ్యూస్ ల మీద పడతారు. పరగడుపున వాకింగ్, జాగింగ్ తర్వాత మీకు జ్యూస్ తాగే అలవాటుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు…
ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం డబ్బులు ఖర్చు పెట్టడమేకాకుండా.. ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఈ ఐదింటిని చేర్చుకోవడంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దామా.. పెరుగు పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును…
ప్రస్తుతం ప్రపంచాన్ని మరో వైరస్ వణికిస్తోంది. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగు అవ్వకముందే మరో ప్రాణాంతక వ్యాధి మానవాళికి సవాలు విసురుతోంది. అదే మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. ఈనేపథ్యంలోనే డబ్ల్యూహెచ్వో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని పేర్కొంది. మంకీపాక్స్ ఉన్నవారు ఇతరులతో శారీరకంగా కలవడం కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్య సంస్థ చీఫ్…
నీళ్లు ఎంత తాగితే అంత మంచిది ఇది మనం ఎప్పుడు అందినోట వినే మాట. దాని వల్ల చాలా అనారోగ్యాల నుంచి బయట పడవచ్చనీ మనకు తెలుసు. కానీ, తగిన మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది అనారోగ్యం నుంచి బయట పడొచ్చని మనందరికి తెలుసు కానీ.. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్హైడ్రేషన్ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది. మనిషికి జీవించేందుకు నీరు అత్యవసరం. సరైన…
వైద్యుడు చెప్పేవరకూ తెలియదు. ఆమాటకొస్తే పరీక్ష చేసేవరకూ వైద్యుడికే తెలియదు. అంత మాయదారి సమస్య హైపర్టెన్షన్. నియంత్రణలో ఉంచుకుంటే బానిసలా పడి ఉంటుంది. లక్ష్మణరేఖ దాటగానే.. దశకంఠుడిలా విజృభిస్తుంది. సకల రోగాలకూ స్వాగతద్వారం అవుతుంది. బీపీ విషయంలో జీవనశైలి సర్దుబాటుకు సాటివచ్చే చికిత్సా విధానమే లేదు. అధిక రక్తపోటు (హైపర్టెన్షన్).. నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. సునామీలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రళయమై జీవితాన్ని కబళిస్తుంది. మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నామమాత్రమైన…
ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, ముడతలతో యువతీ, యువకులు బాధపడుతూ వుంటారు. వారు అనేక క్రీములు వాడుతుంటారు. అయితే తాజాగా మార్కెట్లోకి వచ్చింది ఫ్రీక్వెన్నీ థెరపీ. ఇది పెట్టుకుంటే ఎలాంటి నల్ల మచ్చలైనా మాయం అయిపోతాయి. ముడతలు మటుమాయం అవుతాయంటున్నారు శ్రీచందన. ఎన్టీవీ హెల్త్ లో ఆమె ఏం చెప్పారో చూద్దాం.
ఈమధ్యకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు, ఏసీల్లో వుండేవారికి బాధించే ప్రధాన సమస్య పైల్స్. హెమరాయిడ్స్.. మలద్వారం దగ్గర మొదలయ్యే ఈ పైల్స్ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సరిగా కూర్చోలేరు.. నిలబడలేరు అన్నట్లుగా వుంటుంది వీరి పరిస్థితి. కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. సాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట…
కొంతమంది పగలు మొత్తం విపరీతంగా పనిచేసి రాత్రిళ్లు ఫుల్లుగా తినేస్తుంటారు. కానీ రాత్రిళ్లు ఎక్కువ మొత్తంలో తినడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ కొన్నిరకాల ఆహారాలు అసలు తినకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ✪ బీట్రూట్: బీట్రూట్ చాలా పోషకాలున్న వెజిటేబుల్. కానీ రాత్రి వేళ దీన్ని తినడం మంచిది కాదు. ఎందుకంటే రాత్రిపూట బీట్రూట్ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర…
వేసవి సీజన్ వచ్చేసింది. వేసవిలో ప్రతిఒక్కరూ ఫ్రిజ్ కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తారు. ఫ్రిజ్లోని నీరు తాగాలని ఆరాటపడతారు. అయితే అలాంటి వారికి మట్టికుండ విలువ తెలియదు. సాధారణంగా మట్టికుండను పేదవాడి ఫ్రిజ్ అంటారు. మట్టికుండలో నిల్వ చేసిన నీళ్లు అమృతంలా ఉంటాయని మన పెద్దలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. పూర్వకాలంలో మట్టికుండలోని నీళ్లను మాత్రమే అందరూ తాగేవారు. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కాలం మారే కొద్దీ మట్టి కుండలు కాకుండా జనాలు రిఫ్రిజిరేటర్లకు అలవాటు…
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 1975 నుంచి ప్రపంచంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే 2030 నాటికి ప్రపంచంలోని యుక్త వయసు కలిగి ఉన్నవారిలో సగం మంది అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న జనాభా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇండియాలో ఊబకాయం ప్రాబల్యం 40.3…