Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం శృంగారమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచాన్ని మరో వైరస్ వణికిస్తోంది. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగు అవ్వకముందే మరో ప్రాణాంతక వ్యాధి మానవాళికి సవాలు విసురుతోంది. అదే మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. ఈనేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని పేర్కొంది. మంకీపాక్స్ ఉన్నవారు ఇతరులతో శారీరకంగా కలవడం కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. తుంపర్ల ద్వారా మంకీపాక్స్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
గతంలో మంకీపాక్స్ వ్యాప్తి లేని దేశాల్లోనూ ఈ కేసులు వెలుగుచూస్తున్న మాట వాస్తవమేనని, కానీ వాటిని నివారించవచ్చు అని తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తంగా 29 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగుచూసినట్లు సమాచారం. ఈ వైరస్ అధికంగా వ్యాపించే ఆఫ్రికా దేశాలతోపాటు ఇతర దేశాల్లో దాదాపు 1000 కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓకు నివేదికలు అందాయి. మునుపెన్నడూ ఈ వైరస్ లేని దేశాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ వల్ల ఆఫ్రికాలో మొత్తం 66 మంది మృతిచెందారు.
Viral News: డోంట్ మిస్.. ఈనెల 24న ఆకాశంలో అద్భుతం
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఈ వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడంతోపాటు, ఇతరులను రక్షించేందుకు ఉత్తమ మార్గాలున్నాయని టెడ్రోస్ సూచించారు. ‘మంకీపాక్స్ సోకినట్లు తేలితే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. ఆపై వైద్యులను సంప్రదించి కావాల్సిన చికిత్స తీసుకోవాలి. మంకీపాక్స్ చికిత్స కోసం యాంటీవైరల్, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ సరఫరా పరిమితంగా ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఆ టీకాలు వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. వాటి సరఫరా, పంపిణీ కోసం సమన్వయ యంత్రాంగాన్ని డబ్ల్యూహెచ్‌ఓ అభివృద్ధి చేస్తోంది’ అని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ తెలిపారు.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!