ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. రోజుకి 15 వేల చొప్పున టోకెన్లు ఇస్తోంది. నిరంతరం కొనసాగనుంది టోకెన్ల జారీప్రకియ. కరోనా కారణంగా సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేశారు. తాజాగా ఆ ప్రక్రియ ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి…
కరోనా నుంచి కోలుకున్నవారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలు ఉన్నట్లు తమ పరిశోధనలో స్పష్టమైందని బ్రిటన్ సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే సాధారణ పరీక్షల్లో ఈ లోపం బయట పడకపోవచ్చని వారు సూచించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పలువురిలో శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. అయితే అది అలసట వల్ల జరుగుతుందా…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న సంగతి తెల్సిందే. దీనిపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు చేశామని.. కరోనా కేసులతో వస్తున్న రోగులకు సత్వర వైద్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేస్తూ… ఉచిత మెడికల్ కిట్ లను అందిస్తున్నామని ప్రకటన చేశారు. Read Also: ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు:…
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ వైద్యారోగ్య అధికారులను కలవరానికి గురి చేస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,926 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. కరోనాతో ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు. Read Also: ఒళ్లు…
కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు,అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి…
తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఎప్పుడూ… రాష్ట్ర ప్రజల్ని అలెర్ట్ చేసే డీహెచ్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలకు కరోనా ముందు జాగ్రత్తలు చెప్పే డీహెచ్ శ్రీనివాస్ రావుకు స్వల్ప స్థాయి లక్షణాలు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. Read Also: మానవత్వం లేని మనిషి.. కేసీఆర్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 500లోపు కరోనా కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం…. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4, 955 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది.…
తెలంగాణ రాష్ట్రం పై కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. ఈ రోజు తాజా గా రాష్ట్ర వ్యాప్తంగా 2,398 కరోనా కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే.. 79 కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్…
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైనా మొత్తం కేసుల సంఖ్య 20,93,860 కు చేరింది. ఇందులో 20,61,039 మంది కోరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 14,508 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,313 గా ఉంది. కాగా గడిచిన 24 గంటల్లో 418 మంది కోవిడ్ మహమ్మారి…
కోవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్యసిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గురువారం నాటికి మొదటి డోస్ 2.93 కోట్లు, రెండో డోస్ 2.06 కోట్లు, ప్రికాషన్ డోస్ మరియు బూస్టర్ డోస్ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు. 15-17 ఏళ్ల వారికి 8.67 లక్షల డోసులు (47%) వేశారు. మొదటిడోస్ లక్ష్యానికి మించి దాదాపు…