Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి ఇంటికి ఆర్ఎంపీ, పీఎంపీలు భారీగా చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ఎంపీ, పీఎంపీల పై వైద్య ఆరోగ్య శాఖ దాడులు చేస్తుందంటూ 3000వేల మంది ఆర్ఎంపీ లు, పీఎంపీలు మంత్రి ఇంటికి తరలి వచ్చారు. తమ పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న దాడులను ఆపివేయాలని మంత్రిని ఆర్ఎంపి, పీఎంపిలు కోరారు. తమకు భద్రత కల్పించాలంటూ మంత్రిని కోరారు. ప్రథమ చికిత్సే చేయాలంటూ ఆర్ఎంపి, పీఎంపీలకు మంత్రి మల్లారెడ్డి సూచించారు. అబార్షన్లు, డెలివరీలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు మంత్రి మల్లారెడ్డి.
Read also: Sova virus: బ్యాంకింగ్ యాప్స్కు ‘సోవా’ ముప్పు
మేడ్చల్ జిల్లా నుంచి ఆర్‌ఎంపీ, పీఎంపీలు వారి సమస్యలపై వచ్చారని మంత్రి తెలిపారు. అప్పట్లో డాక్టర్లు లేకపోవడం వలన ఆర్‌ఎంపీ, పీఎంపీలు చిన్న చిన్న ఆపరేషన్లు పలు విధమైన సేవలందించారని తెలిపారు. అయితే.. సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి, 10వేల కోట్లు కేటాయింది.. బస్తీ దవాఖానాలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించేందుకు కృషి చేశారని తెలిపారు. ఇన్ని రోజులు సేవలందించిన ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం అన్యాయం చేయదని అన్నారు. ఎంబీబీఎస్ చదివింది కాదు కాబట్టి ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. సీఎం, హెల్త్ మినిష్టర్ తో మాట్లాడుతామని మంత్రి తెలిపారు. ఏదైన సమస్యవుంటే పెద్దాసుపత్రులకు పంపాలని సూచించారు. అంతేగానీ ఆర్ఎంపీలు, పీఎంపీలు చేయాకూడదని అన్నారు.
Kottu Satyanarayana: అమరావతి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది..