TS: దంచికొడుతున్న ఎండలు.. ఆ సమయంలో అవసరం అయితేనే బయటకు రండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి… రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ మంట పుట్టిస్తున్నాయి… ఓవైపు ఎండల తీవ్రత.. మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. దీంతో ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని వెల్లడించారు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు. ఆ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో.. మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగొద్దని సూచించారు.. అత్యవసరం అయితే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలన్న ఆయన.. లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు..
Read Also: Vijayasai Reddy: కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగా.. సాయిరెడ్డి ఛలోక్తులు
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నల్లటి దుస్తులు వేసుకోవద్దు.. తెల్లటి దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలంగాణ ఆరోగ్య శాఖ పేర్కొంది.. ఈ సమయంలో ఫ్లూయిడ్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎండదెబ్బె తగిలిందంటే చెమట పట్టకపోవడం, గొంతు ఎండిపోవడం, అత్యంత నీరసం, తలనొప్పి, గుండెదడ, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని.. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని తెలిపారు. ఇక, ట్రాఫిక్ పోలీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేవాళ్లు, జర్నలిస్టులు, ఎక్కువగా తిరిగేవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ఇక, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అంగన్ వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విరివిగా అందుబాటులో పెట్టామని.. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని.. ఈ కాలంలో ఫుడ్, వాటర్ ఎక్కువగా పొల్యూట్ అయ్యే అవకాశం ఉందని.. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిపారు.. కోవిడ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉందని.. 20పైగా జిల్లాల్లో సున్నా కేసులు నమోదు అవుతున్నాయని.. జీహెచ్‌ఎంసీలో 20 వరకు కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయని.. కరోన ఆంక్షలు కేంద్రం పూర్తిగా తొలగించింది.. కానీ, రాష్ట్రంలో మాస్క్, భౌతికదూరం పాటించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!