హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ప్రాణాలు వదిలింది.. పీజీ చేస్తున్న మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని తనువు చాలింది… హెచ్‌సీయూలోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మౌనిక.. ఇక, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు… తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే మౌనిక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.. చదువు ఎంత చదివినా నా మనసులోకి ఎక్కడం లేదని సూసైడ్‌లో మౌనిక పేర్కొన్నట్టు తెలియజేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న మౌనిక స్వస్థలం పెద్దపల్లి జిల్లా తారుపల్లి.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉండగా… మౌనిక మృతిపై కేసు నమోదుచేసిన గచ్చిబౌలి పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. కొన్ని ఘటనలు తీవ్ర వివాదాస్పదంగా కూడా మారిన సంగతి తెలిసిందే.