World Cup 2023: ఉప్పల్ మ్యాచ్ రీ షెడ్యూల్.. బీసీసీఐ సమాధానం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Vice President Rajeev Shukla Gaves Clarity on Hyderabad hosting World Cup 2023 Matches: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని నగర పోలీసు విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న ఉండగా.. ఆ మరుసటి రోజే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ ఉంది. వరుసగా రెండు రోజుల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే.. సెక్యూరిటీపరంగా ఇబ్బందులు వస్తాయని హైదరాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐకి హెచ్‌సీఏ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.
వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూలింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండవని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ‘ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు జరగనున్న ఉప్పల్ స్టేడియంకు నేను ఇన్‌ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నా. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అయితే ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చడం అంత సులభం కాదు. షెడ్యూల్ మార్చే అవకాశం లేదు. కేవలం బీసీసీఐ మాత్రమే షెడ్యూల్‌ను మార్చలేదు. జట్లు, ఐసీసీ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని రాజీవ్ శుక్లా అన్నారు. శుక్లా వ్యాఖ్యలను బట్టి రీషెడ్యూల్‌కు అవకాశం లేదని స్పష్టం అయింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: Jasprit Bumrah Record: ఏడాది తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే రెండో బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు!
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 10న శ్రీలంకతో పాక్ తలపడనుంది. అంతేకాదు మెగా టోర్నీకి ముందు రెండు వార్మప్ మ్యాచ్‌లను కూడా ఉప్పల్‌లోనే పాకిస్తాన్ ఆడనుంది. అంటే మెగా టోర్నీ కోసం వచ్చే పాక్ జట్టు హైదరాబాద్‌లోనే ఎక్కువ రోజులు గడపనుంది. పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్‌లో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే హైదరాబాద్ పోలీస్ విభాగం, హెచ్‌సీఏ ఆందోళన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!