హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశించింది. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్ విచారణ చేపట్టారు..హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో విచారణ చేపట్టి వెంటనే ఆ పేరును తొలగించారు.
READ MORE: Gudivada Amarnath: మేయర్‌పై అవిశ్వాసం గెలిశారు.. విశాఖ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు..!
ఇదిలా ఉండగా.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారులపై అవినీతి 2023లో కేసు నమోదైంది. వీరంతా అసోసియేషన్ సొమ్మును దుర్వినియోగం చేశారని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. వారిపై పోలీసులు దర్యాప్తు చేశారు. సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కాంటే బోస్ ఫిర్యాదు మేరకు హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్, ఇతర మాజీ ఆఫీస్ బేరర్లపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించారు.
READ MORE: Janhvi Kapoor : అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే యుద్ధాలే జరిగేవి : జాన్వీకపూర్