పాకిస్థాన్‌పై ఇటీవల భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ జరిగింది. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సిందూర్ విషయాలను మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా వీరిద్దరూ గుర్తింపులోకి వచ్చారు.
ఇది కూడా చదవండి: Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..
అయితే ఆపరేషన్ సిందూర్‌పై హర్యానాలోని సోనిపట్ అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశాలను అసోసియేట్ ప్రొఫెసర్ ‘‘ఆప్టిక్స్’’గా అభివర్ణించారు. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్..
అలీ ఖాన్ మహ్మదాబాద్ పోస్టులపై బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం ఢిల్లీలో పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. బీజేపీ యువ మోర్చా నాయకుడు ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
ప్రొఫెసర్ అలీ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు యూనివర్సిటీ నిర్ధారించింది. దర్యాప్తులో పోలీసులకు, అధికారులకు సహకరిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొ్న్నారు. ఇక ప్రొఫెసర్‌కు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసు పంపించింది. నోటీసు ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది. కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లకు సెల్యూట్ చేస్తున్నామని.. వారిపై ప్రొఫెసర్ ఉపయోగించిన పదాలకు కమిషన్ ముందు హాజరై విచారం వ్యక్తం చేస్తారని తాము ఊహించినట్లు కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా అన్నారు.
అయితే మహిళా కమిషన్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుందని ప్రొఫెసర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. పోస్టులను తప్పుగా చదవి, తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపోయానన్నారు. వాటి అర్థాన్ని తారుమారు చేశారని వాపోయాడు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లో వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. అలాగే సైనికులు చనిపోయారు. ఇక 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.