వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో ముఖ్య అతిథిగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్, ఆర్బీఐ, బ్యాంకర్లు.. హాజరయ్యారు.
తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటి పంపిణీని ప్రారంభించారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. కేతమ్మ, మేడల దేవి సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొమురవెల్లి మల్లన్న జాతరలో భాగంగా మంత్రి హరీశ్ రావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.…