Harish Rao : తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బెల్లంపల్లిలో 100పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వల్లే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేపట్టినట్లు ఆయన తెలిపారు. పల్లె దవాఖానాల ఏర్పాటు, సీసీ రోడ్డు కావాలని అడిగారని అందుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి వివరించారు. ఉమ్మడి ఏపీలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా ఇప్పుడవి 17పెంచుకున్నామన్నారు. సింగరేణి కార్మికులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుదన్నారు మంత్రి.
Read Also: DGP Mahender Reddy: దేశ వ్యాప్తంగా నిందితుల డేటాబేస్ మన దగ్గర ఉంది
ఉమ్మడి రాష్ట్రంలో మూడు డయాలసిస్ కేంద్రాలు ఉంటే, నేడు 102 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ఒక్క డయాలసిస్ పై ఏడాదికి వంద కోట్ల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బోర్ బావుల వద్ద మీటర్లు పెట్టనందుకు కేంద్రం నుండి నిధులు రాకుండా చేశారన్నారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఎందుకు 30 వేల కోట్లు తెలంగాణకు రాకుండా ఆపారో సమాధానం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేలా కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. తమ ప్రభుత్వ పథకాలు బాగున్నాయి కాబట్టి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, వంటి పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. తెలంగాణ, మంచిర్యాల, బెల్లంపల్లి మీద బిజెపికి ప్రేమ ఉంటాదా.. మన కేసీఆర్ కు ఉంటదా.. బిజెపి, కాంగ్రెస్ ది ఓట్ల యావ.. కష్టాల నుండి ఒడ్డుకు చేర్చే నావ..బీఆర్ఎస్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎలాంటి కరోనా పరిస్థితులు వచ్చినా కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఉన్నారని… ఎలాంటి పరిస్థితులనైనా అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు మంత్రి.