Harish Rao: బీజేపీ హటావో సింగరేణి బచావో అని మనం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారుమంత్రి హరీశ్ రావు. మన పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారని ఎద్దేవ చేశారు. ప్రధాన మంత్రి వచ్చి రామగుండంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో లిగ్నైట్ గనులను గుజరాత్ గనుల సంస్థకు ఇచ్చారని, ఇక్కడ వేలం వేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. గుజరాత్ కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి అంటూ ప్రశ్నించారు. సింగరేణి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. నాలుగు గనులు ఎలా ప్రైవేటు పరం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ హటావో సింగరేణి బచావో అని మనం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. పనులు చేసేది ఎవరు.. పన్నులు వేసేది ఎవరో ప్రజలు ఆలోచించాలని హరీష్ రావు పేర్కొన్నారు.
Read also: Pakistan: హిందూ మహిళ తల నరికి.. చర్మం ఒలిచి దారుణంగా హత్య
బీజేపీది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాదని, ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోందన్నారు. జహీరాబాద్ పట్టణంలో 312 డబుల్ బెడ్‌రూం ఇండ్లు, సమీపంలోని దిగ్వాల్ గ్రామంలో 88 2బిహెచ్‌కె ఇళ్లను ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులను సన్మానించారు.24X7 విద్యుత్ సరఫరా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, దళిత బంధు వంటి అనేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని, పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వం అమలు చేయలేని పథకాలను మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు అన్నారు.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను పొరుగున ఉన్న కర్ణాటకతో పోల్చి తాము పాలిస్తున్న రాష్ట్రాల్లోనే డబుల్ ఇంజన్ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ప్రచారం చేస్తోందని నిన్న జరిగిన సభలో మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
CM Jagan : కందుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా