Jeevan Reddy: పీవీ నర్సింహా రావు కాంగ్రెస్ వాదీ.. నిన్న హరీష్ రావు ప్రేమ వలకపోస్తే ఆశ్చర్యంగా వుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం గా, పీఎం గా పనిచేశారు పీవీ అన్నారు. ఏ పదవీ చేపట్టిన ఆ పదవీకి వన్నెతెచ్చారనిత తెలిపారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్ లో చేపట్టాలని కుటుంబ సభ్యులే కోరారని అన్నారు. అన్ని లాంఛనాలతో గౌరవ వందనలతో చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం బాధాకరం…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. ఇప్పుడే గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే మైక్ ఇవ్వలేదన్నారు. సీఎం స్లీపింగ్ రిమార్కు చేశారు.. సీఎం మాదిరిగా స్లీపింగ్ రిమార్కు చేయనన్నారు. ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు.. ఇంకా పీసీసీ చీఫ్ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా.. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన విమర్శలు గుప్పించారు. దీంతో సీఎం కామెంట్స్ పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సీఎం సభను తప్పుదోవ పట్టించారు అంటూ ఆయన తెలిపారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యిందని విమర్శించారు. కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన…
Telangana Speaker: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. స్పీకర్ నామినేషన్ కి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఏర్పడలేదు.. మనం కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు.. వాళ్ళు మనకంటే బాగా చేయాలని కోరుకుందామని తెలిపారు. అధికార పార్టీ వాళ్ళు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేశారు.. ప్రజలు నమ్మారు వాళ్ళకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు…
Vijayshanti Tweet: కాంగ్రెస్ నేత విజయశాంతి మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘సుమారు 10 సంవత్సరాల తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు…
Ponguleti: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాకముందే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బోనస్ కింద రూ.500 ఎప్పుడు ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.