Ponguleti: అప్పుడే విమర్శలా..? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాకముందే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలు లేని హరీష్ రావు తెలంగాణను దోచి మామకి కట్టపెట్టాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శలా? అని ప్రశ్నించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.. తిన్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన మీరా మా ప్రభుత్వం నుంచి మాట్లాడేది అంటూ హరీష్ రావును ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణను 9 ఏళ్లలో దోచి అప్పుల రాష్ట్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేశారన్నారు. దోచుకున్న డబ్బులన్నీ మీ మామ దగ్గర పెట్టారని అన్నారు.
Read also: Rashmika: ‘యానిమల్’లో రచ్చ లేపావ్.. రష్మికపై అమితాబ్ ప్రశంసలు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
రైతుబంధు పైసలు వేయడానికి మూడు నెలల సమయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ మా గురించా మాట్లాడేది అంటూ నిప్పులు చెరిగారు. అప్పుడే ఏముంది ముందుంది ముసళ్ల పండుగ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టు కోసం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం కావాలని మమ్మల్ని గెలిపించారని తెలిపారు. శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై సంతకాలు చేసారు మన ముఖ్యమంత్రి అని తెలిపారు. తూతూ.. మమ.. అనుకోకుండా చెప్పిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతు బంధు పైసలు వేయడానికి మీరు తీసుకున్న టైం 3 నెలలు అని గుర్తు చేశారు. గురువింద లాగా ప్రవర్తించకండి.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Mega 156 : మెగాస్టార్ సరసన నటించనున్న ఆ సీనియర్ హీరోయిన్..?
తాజావార్తలు
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!