Gandra Venkata Ramana: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు గండ్ర కౌంటర్
- మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి
- భూపాలపల్లిలో జరిగిన హత్యను తాము ఖండిస్తున్నాం.
- చట్టాన్ని మేం గౌరవిస్తాం.
- CB-CID కాదు, సీబీఐ విచారణ జరిగినా మాకు భయంలేదు
- నిజానిజాలు బయటపడాలంటే సీబీఐ విచారణకైనా సిద్ధమేనని స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandra Venkata Ramana: భూపాలపల్లి హత్య కేసుపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి స్పందించారు. నిన్న భూపాలపల్లిలో జరిగిన హత్యను తాము ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కేసును వివాదాస్పదం చేయాలని కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు వెనుక భూవివాదమే ప్రధాన కారణమని అందరూ చెబుతున్నారని, హత్య చేసిన వారు కూడా అంగీకరించారని తెలిసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గండ్ర వెంకట రమణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Gold Smuggling: భారత్-బంగ్లా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత.. ఒకరు అరెస్ట్
Also Read
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాటలు చూస్తే బాధాకరంగా ఉందని, ఆయన మాటలు కేసుపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని.. కానీ కేసీఆర్, హరీష్ రావు, తనని అనవసరంగా ఆరోపిస్తున్నారని గండ్ర అన్నారు. అలాగే, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఎవరినైనా నిర్ధారణ లేకుండా ఆరోపించడం అలవాటుగా మారిందని విమర్శించారు. హత్య కేసును అసలు విషయాన్నుంచి మళ్లించడానికి కుట్ర జరుగుతోందని.. మృతుడి భార్యతో ఇతర వ్యక్తులు కావాలని మాట్లాడిస్తున్నారని అన్నారు. మా మీద ఆధారంలేని ఆరోపణలు చేస్తున్నారని గండ్ర వెంకట రమణ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Success Story: రియల్ ఎస్టేట్‌లో ‘నియర్ ఎస్టేట్’ సరికొత్త మైలురాయి!
ఈ కేసుపై తాము విచారణకు ఎలాంటి అభ్యంతరం చెప్పమని, నిజానిజాలు బయటపడాలంటే సీబీఐ విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ‘CB-CID కాదు, సీబీఐ విచారణ జరిగినా మాకు భయంలేదు. చట్టాన్ని మేం గౌరవిస్తాం, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం తగదని గండ్ర వెంకట రమణ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో స్పష్టమవుతాయని, రాజకీయం చేయకుండా నిజాలు బయటకు రావటానికి సహకరించాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!