న్నికల్లో భారీ పోలింగ్ జరగడం అభ్యర్ధుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. 2018 ఎన్నికల సందర్భంగా హుజురాబాద్‌లో 2,26,000 పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నికలో కొత్తగా నమోదు చేసుకున్నవారికి ఓటు హక్కు కల్పించారు. దీంతో పది వేల ఓట్లు పెరిగి… ఆ సంఖ్య ఇప్పుడు 2,36,873కు చేరింది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలున్నాయి. ఇల్లంతకుంట మండలంలో మిగతా మండలాల కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మండలంలో కేవలం 24,799 మంది ఉండగా.. హుజురాబాద్ మండలంలో…
సిద్ధిపేట కలెక్టర్ రైతులపై మాట్లాడిన మాటలు నియంతలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేవుళ్లతో సమానమని తెలిపారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ – బీజేపీ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రైతుల పొట్టగొట్టి నడ్డి విరిచి రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలన్నారు. బండి సంజయ్, తెలంగాణ మంత్రులు…
ఒకవైపు ఉపఎన్నిక.. ఇంకోవైపు పార్టీ ప్లీనరీ. టీఆర్ఎస్కు ఈ రెండూ ముఖ్యమే. కానీ.. పార్టీ ప్లీనరీకి హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్ నేతల రాలేదు. వదలరు.. కదలరు అన్నట్టు అక్కడే అతుక్కుపోయారు. ఇదే అధికారపార్టీలో చర్చగా మారింది. ఎందుకిలా? ప్లీనరీలో హుజురాబాద్‌పై గులాబీ బాస్ చేసిన ప్రకటనను పార్టీ వర్గాలు ఎలా చూస్తున్నాయి? హుజురాబాద్ నుంచి కాలు బయట పెట్టొద్దని ఆదేశాలు? హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల దృష్టి అంతా…
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఎన్ని కథలు పడ్డా కూడా కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసి, ఈయనను పార్టీ నుండి కేసీఆర్ బయటకు వెళ్లగొట్టేది భవిష్యత్తులో తప్పని పరిణామమని పేర్కొన్నారు విజయశాంతి. ఢిల్లీ లో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అందుకు మొదట హరీష్ రావు…
సీఎం కేసీఆర్… మహానాయకుడు అంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైనా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్ రావు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ…
హుజురాబాద్ బైపోల్లో ప్రత్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ప్రచారంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులపై తీవ్రమైన మాటల దాడి చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబు… అధిపత్యం కోసం రజాకార్ల ను నియమించుకున్నారు . కేసీఆర్ నిజాం అయితే..ఖాసీం రిజ్వి హరీష్ రావు తన పెత్తనం నిలబెట్టుకోవడానికి నిజాం లాంటి కేసీఆర్…హరీష్ రావు ను…
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కేంద్రమంత్రి లాంటి పదవిలో ఉండి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బడ్జెట్లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందని తాను నిరూపిస్తానని ఆయన పేర్కొన్నారు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, సర్ ఛార్జ్ పేరుతో పెట్రోల్‌పై రూ.22.47ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నులు పెంచిందని హరీష్…
వానాకాలపు పంట ప్రతీ గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని…తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వర్షానికి తడిసిన పంటను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని…రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ రైతు బంధు పార్టీ అని…… బీజేపీ రైతులపై బందూకులు ఎత్తిన పార్టీ అని ఫైర్ అయ్యారు. రైతును రాజుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. హుజూరాబాద్ లో ఐదు వేల ఇళ్లు కట్టించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు మంత్రి…
మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక తేదీ తరుముకొస్తున్న నేపథ్యం లో… నేతల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. అయితే.. తాజాగా హన్మకొండ జిల్లా పెంచికలపేట సభలో ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు. గ్యాస్ సిలిండర్ ధర లో 291 రూపాయలు రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు. 291…