కృష్ణా జలాలపై మంత్రి హరీష్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడు తూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏడేళ్లుగా కేంద్ర ప్రభు త్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. నీటి కేటాయిం పులపై తెలంగాణ ఏర్పడిన 42రోజుల్లోనే కేసీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. కృష్ణా జలాలపై మాకు న్యాయపరమైన హక్కు కావాలి. ఇదేమి గజేంద్ర షెకావత్ తో వ్యక్తిగత పంచాయతీ కాదన్నారు. కేంద్రం స్పందించకపోవడం వల్లనే మేము ఆగస్ట్ 2015లో సుప్రీం కోర్టు గడప తొక్కాం. చట్ట ప్రకారంగా మీదగ్గరికి…
తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాలన్నారు. పచ్చి అబద్ధాలతో కిషన్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారన్నారు. బీబీనగర్ ఎయి మ్స్‌కు స్థలం ఇవ్వడంతోపాటు బిల్డింగ్ కూడా ఇచ్చాం. ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎయిమ్స్ అనేది విభజన చట్టం ద్వారా తెలంగాణకు…
మరోసారి దేశవ్యాప్తంగా సిద్ధిపేట పేరు మార్మోగిపోయింది. ప్రసిద్ధి పేటగా… తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప జేసింది. సిద్ధిపేట శుద్ధిపేట అని మరోసారి చాటి చెప్పింంది. స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయి లో ఎంపిక అయిన సిద్ధిపేట పట్టణం. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల…
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు.. వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలను కూడా హరీష్‌రావుకు అప్పగించనున్నారు.. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయానికి రాగా.. కాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.. కాగా, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఆరోపణలు రావడంతో.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వైద్యారోగ్యశాఖ బాధ్యతలను కేసీఆర్ దగ్గరే ఉంచుకున్నారు.. కరోనా సమయంలో.. సమీక్షలు…
సిద్ధిపేట పట్టణ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ తాగునీటి జలవలయాన్ని చేపడుతున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. తాగునీటి ఎత్తిపోతలకు దీంతో ఇబ్బందులు తప్పుతాయన్నారు. నాలుగు దశాబ్దాల ముందు చూపుతో..మున్సిపల్ శాఖ శాశ్వత తాగునీటి అభివృద్ధి కో సం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. సిద్ధిపేట రింగ్ మేన్ పైపులైన్ గ్రావిటీ ద్వారా పట్టణంలోని ప్రతీ కాలనీకి నీటిని తరలించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి సిద్ధిపేట మున్సిపాలిటీకి రింగ్ మేన్ కనెక్టీవిటీ…
మొన్నటి దాకా దాదాపు కొన్ని నెలలుగా హుజురాబాద్ ఎలక్షన్‌తో బీజీ బీజీగా ఉన్న హరీష్ రావు శుక్రవారం సిద్ధిపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.12 గంటలు 12 కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని టీఆర్ఎస్ పార్టీ శ్రేణు ల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అటు ప్రజల మధ్య…ఇటు ప్రగతి కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు మంత్రి హరీష్. ” నాయకుడు అనే పదానికి కొత్త అర్థం చెప్పడంలో మంత్రి హరీష్…
సిద్ధిపేట పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో , గ్లోబల్ సైన్స్ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు, జిల్లాలోని, 100 పాఠశాలలకు, సైంటిఫిక్, మూవింగ్, గ్లోబులతో పాటు ఇతర పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధి పేట పట్టణాన్ని, విద్యానిలయం గా తీర్చిదిద్దా మన్నారు. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, ఏ జిల్లాలో సీటు వచ్చినా, సిద్ధిపేటలో సీటు రావా లి అన్నది వాళ్ళ కోరికగా ఉండటం తల్లిదండ్రులు…
సిద్ధిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావుకమిటీల నిర్వహణ, బహిరంగ సభ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తన పిలుపుతో స్వచ్ఛం దంగా యాదాద్రి ఆలయ గోపురానికి బంగారాన్ని ప్రకటించిన కౌన్సి లర్స్, టీఆర్ఎస్ కార్యకర్తలను అభినందించారు. యాదాద్రి ఆలయ బంగారు గోపుర నిర్మాణానికి సిద్ధిపేట నుంచి కిలో బంగారం ఇస్తామని అక్కడి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రకటించారన్నారు. లక్ష్మీ నర సింహ స్వామికి 37 తులాల బంగారం సిద్ధిపేట…
రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని… అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ మేరకు ఎన్ని టీఏంసీల…
గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే ఏర్పాటు చేసిన…