కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని రాచపల్లి గ్రామంలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అసలు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయ్ ఒక్కసారి ఆలోచించాలి. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడు చెప్పాలి అన్నారు. మీకు పని చేసే వాళ్ళను గెలిపించండి. ఈటల లేనిపోని మాటలు…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు బీజేపీ నాయకులు కార్యకర్తలు. అక్కడ గంగుల కమలాకర్ మాట్లాడుతూ… రాష్ట్రం లో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కే ఉంది. బీజేపీ పార్టీ లో పని చేసే వాళ్ళను బయటికి వెళ్లగొట్టరు. విశ్వసనీయతకు వెన్నుపోటు కు మధ్యల జరిగే ఎన్నికలు ఇవి అన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ రోజురోజకీ హుజూరాబాద్ లో ఆదరణ…
టీఆర్ఎస్ సర్కార్‌లో పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేదర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతి ఆత్మగౌరవం కోసం నా చిన్న నాడే కొట్లాడి మా కుల బహిష్కరణకు గురైన వాళ్లం.. అలాంటి కుటుంబం మాది అని గుర్తు చేసుకున్నారు.. ఇక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాడిని.. కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ…
జమ్మికుంటలో కిసాన్ మొర్చ సమావేశానికి ఈటల రాజేందర్, సోమారపు సత్యనారాయణ, యెండల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. అక్కడ ఈటల రాజేందర్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ మీటింగులకు బయట నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రజలు కాదు. కేసీఆర్ కు టీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం లేక తొండాట ఆడుతున్నాడు. జిత్తుల మారి ఎత్తులతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడు. తన టక్కుటమార విద్యలు ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ…
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ రెండు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని… ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూరుతుందని… ఆరోగ్య శ్రీ ద్వారా 87 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది అందుకే ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్నామని ప్రకటించారు. గత మే 18 2021 నెల నుండి ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని… మే 18 వతేది…
కమలాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధూం ధాం కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి హరీశ్ రావు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ఈటల రాజేందర్ తన బాధను.. మనందరి బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాను రాసుకున్న బురదను.. మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడు. తన బాధను మన బాధగా మార్చుకుని ఆగమవుదామా.. మనందరి బాధలు తీర్చే కేసీఆర్ కు అండగా ఉందామా.. ఆలోచించండి అని…
ఆరు సార్లు ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించారు.. ఇప్పుడు రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. మోత్కులగూడెం 90శాతం టీఆర్ఎస్ వైపు వచ్చిందన్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.. 18 ఏళ్లలో మీకు ఈటల చేయని పని, మీ…
హుజురాబాద్ పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… పట్టణంలో ఎకరం భూమిలో కోటి రూపాయలతో జయశంకర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం శుభ దినం. ఏడాది లోగా భవనం అందిస్తాం. ప్రభుత్వపరంగా ఏనాడైనా మాజీ మంత్రి సంఘ భవనం ఇచ్చిందా.. కళ్యాణ లక్ష్మీ దండగ అణా మాజీ మంత్రికి ఓటు వేద్దామా… కాంగ్రెస్ కనుమరుగైంది… హుజురాబాద్ లో బొట్టుబిళ్లకు,లక్ష రూపాయల కల్యాణ లాక్షికి పోటీ జరుగుతుంది. బిసిల జనగణన జరగాలి అన్న కేంద్రంలో…
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి హిందు శ్రీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరికలు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నికాసైన బిసి బిడ్డా గెల్లు శ్రీనివాస్. బిసిలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. బిసిల కోసం టీఆరెఎస్ ప్రభుత్వం మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసినం.బిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే…
మెదక్ జిల్లాలో పాదయాత్రలు చేసే వారిని సూటిగా అడుగుతున్నా.. రైతులపై, జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు పాదయాత్ర చేయాలి అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంతో రైతులపై భారం పడింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. కేంద్ర ప్రభుత్వం రైతు ఉసురు పోసుకుంటున్నది. 5 లక్షల భీమా ఇచ్చి రైతుకు భరోసా ఇచ్చింది దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే…