ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం పలువురు టీమిండియా క్రికెటర్లు మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ రామ్చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపు సంబరాలను రామ్చరణ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి…
IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు.…