Hardik Pandya: హార్దిక్ పాండ్యా సరికొత్త సంచలనం.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Creates World Record As Cricketer On Instagram: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైదానంలో హార్దిక్ పాండ్యా ప్రభంజనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అతడు కొన్ని అరుదైన ఘనతల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఓ సంచలన రికార్డ్‌ని నమోదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన హార్దిక్.. ఈ ఫీట్ సాధించిన అతి పిన్న వయస్కుడైన (29 ఏళ్లు) క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే అతడు టెన్నిస్ దిగ్గజాలైన రఫెన్ నాదల్ (17.9M), రోజర్ ఫెదరర్ (11+M), ప్రముఖ రేసర్ మాక్స్ వెర్స్‌టాపెన్ (9.5M), ఎర్లింగ్ హాలాండ్ (24.3M)లను అధిగమించాడు.
Satya kumar: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో విదేశీ పెట్టుబడులు ఒక్కపైసా రాలేదు..!
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ పాండ్యా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాడు. ఆమధ్య తన పెళ్లి ఫోటోలను హార్దిక్ షేర్ చేసినప్పుడు.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇలా అతడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండటం వల్లే.. ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 25 మిలియన్ మార్క్ అందుకొని, అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హార్దిక్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి ఒక్క అభిమాని తనకు ఎంతో ప్రత్యేకమని, ఇన్నాళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. కాగా.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!