ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్డిక్ పాండ్యా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వికెట్ తీసిన తొలి టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్ బౌలింగ్ వేసిన పాండ్యా… ఐర్లాండ్ ఓపెనర్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ఇంత వరకు టీ20ల్లో టీమిండియా జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాళ్లు ఒక్క వికెట్ కూడా…
కేవలం బ్యాట్‌తోనో, బంతితోనో కాదు.. అప్పుడప్పుడు క్రికెటర్లు కొన్ని అనూహ్యమైన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. ఇప్పుడు దినేశ్ కార్తీక్ ఖాతాలోనూ అలాంటి అరుదైన రికార్డే నమోదైంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బెస్ట్ ఫినిషర్‌గా అవతారమెత్తి భారత జట్టులోకి అడుగుపెట్టిన ఈ వెటరన్ వికెట్ కీపర్.. తన అంతర్జాతీయ కెరీర్లో 10 మంది కెప్టెన్ల కింద ఆడి రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంతవరకు ఏ ఒక్క ఆటగాడు ఇంతమంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు.…
టీమిండియా జట్టుకు గాయాలు, వైఫల్యాలతో కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియాలో చోటు కోల్పోయి తిరిగి బలంగా వచ్చాడు ఈ ఆల్‌రౌండర్. అయితే అందుకోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు చెప్పొకొచ్చాడు పాండ్యా. జట్టుకు దూరమైనప్పుడు తాను చేసిన కృషి.. తనకు ఇటీవలి విజయాల కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చినట్టు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని పాండ్యా పూర్తిగా సద్వినియోగం…
IPL 2022 సీజన్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. సంచలన ప్రదర్శనతో లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్-1, ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి తొలి టైటిల్‌ను దక్కించుకుంది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టిగా రాణించింది. ప్రతీ మ్యాచ్‌కు ఒక్కో ప్లేయర్ సత్తా చాటడంతో అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ చేరిన…
అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే…
ఐపీఎల్ టోర్నమెంట్ ముగియడంతో.. ఇప్పుడు అందరి దృష్టి సౌతాఫ్రికా, భారత్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై పడింది. ఈ నేపథ్యంలోనే మాజీలందరూ ఈ సిరీస్‌పై తమతమ అంచనాల్ని వెల్లడించడం మొదలుపెట్టారు. ఏ జట్టు సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది? టీమిండియాలో ఎవరు బాగా రాణించగలరు? ఎవరెవరు ఏయే స్థానాల్లో దిగితే బాగుంటుంది? అనే విషయాలపై తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషభ్ పంత్,…
అంచనాలు లేకుండా వచ్చి గుజరాత్ టైటాన్స్ ఎలా అదరగొట్టింది?పెద్ద టీమ్ లు ఎందుకు విఫలమయ్యాయి? ఐపీఎల్ క్రేజ్ క్రమంగా తగ్గుతోందా?ఫిక్సింగ్ వార్తల్లో నిజమెంత?క్రికెట్ పండగ కళ తప్పిందా? రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి వచ్చారు. ఫైనల్ ఈవెంట్ వేడుకల్లో మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ పాల్గొన్నారు మ్యాచ్…
ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్‌ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్‌ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి…
టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ హెడ్ కోచ్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్, జయవర్ధనే వంటి విదేశీ హెడ్ కోచ్‌ల నేతృత్వంలో ఆయా జట్లు ఐసీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాయి. అయితే.. తొలిసారి భారత హెడ్ కోచ్ నేతృత్వంలో ఓ జట్టు ఐపీఎల్…
తమ జట్టు ఫైనల్‌కి చేరిందంటే, ఏ ఆటగాడైనా సంతోషంగా ఉండకుండా ఉంటాడా? కానీ, మాథ్యూ వేడ్ మాత్రం సంతోషంగా లేనని బాంబ్ పేల్చాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కి చేరినా.. తాను సంతోషంగా లేనని, వ్యక్తిగతంగా ఈ సీజన్ తనకు చాలా చిరాకు కలిగిస్తోందని అన్నాడు. ఇందుకు ప్రధాన కారణం.. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమేనని వెల్లడించాడు. ‘‘నాకు ఈ సీజన్ వ్యక్తిగతంగా చిరాకు తెప్పిస్తోంది. నేను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే అందుకు కారణం.…