ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం పలువురు టీమిండియా క్రికెటర్లు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపు సంబరాలను రామ్‌చరణ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి…
IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు.…
Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరెన్ని వాదనలు చేసినా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్‌వన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారి ఇష్టమని.. తన అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నాడు. టీ20 ఫార్మాట్లో పాండ్యాకు తిరుగు లేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇటీవల ఆసియా కప్‌లో…
Team India: టీమిండియా స్టార్ ఆటగాడు ధోనీ రిటైర్ అయ్యాక ఫినిషర్ పాత్రను పోషించేవాళ్లు కరువయ్యారు. ఎందుకంటే ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు గొప్ప ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. ఫినిషర్‌కు ఉండాల్సిన లక్షణాలేంటో ధోనీ తన ప్రదర్శనల ద్వారా చూపించాడు. అయితే కొన్నాళ్లు ధోనీ స్థానాన్ని రీప్లేస్ చేసేలా హార్దిక్ పాండ్యా ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత ఫిట్నెస్ లేమి, ఫామ్ కోల్పోవడంతో అతడు జట్టులోనే స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర…