Hardik Pandya : టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, డచ్ రేసింగ్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ వంటి దిగ్గజాల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని హార్దిక్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Read Also: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కష్టాలు
ఈ సందర్భంగా హార్దిక్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టు పెట్టాడు. ‘నాపై ఇంతటి ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్క అభిమాని నాకు చాలా ప్రత్యేకం. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కిరికీ ధన్యవాదాలు’ అని పాండ్యా సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం ఇన్‌స్టాలో పాండ్యాను 25 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే హార్దిక్ పాండ్యాను దాదాపు 25 కోట్ల మంది అభిమానిస్తున్నారన్న మాట.
Read Also: Naveen Case:నవీన్ తల్లిదండ్రుల భావోద్వేగం.. చేతిపై అమ్మ అనే టాటూ చూసి గుర్తుపట్టినం..
అంతర్జాతీయ క్రికెట్లో 2016లో హార్దిక్ పాండ్యా అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి హార్దిక్ క్రికెటర్‌గా మంచి ఫామ్‌లో ఉన్నాడు. 29 ఏళ్ల వయస్సులో అతను భారత జట్టుతో పాటు ఐపిఎల్‌లో సీనియర్ సభ్యుడు. హార్దిక్ చేతిలో స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్, ఆడియో, డెనిమ్స్, షర్టులు, బ్యాటరీలు, లూబ్రికెంట్లు, ఎనర్జీ డ్రింక్, బిస్కట్‌లు, క్యాజువల్ దుస్తులు, షూస్, బెవరేజ్, పెర్ఫ్యూమ్, మీడియా అండ్ బ్రాడ్‌కాస్ట్ వంటి రంగాల్లో 20కి పైగా బ్రాండ్‌లు ఉన్నాయి.