గతేడాది టీ20 అత్యద్భుత పెర్ఫామెన్స్‌తో మెప్పించిన ఆటగాళ్లలో ఓ జాబితాను రూపొందించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అత్యుత్తమ పురుషుల టీ20-2022 జట్టు పేరుతో సోమవారం ఈ జాబితా రిలీజ్ చేసింది. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించగా.. ఈ జట్టుకు ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. మొత్తం 11 మంది సభ్యుల జాబితాను వెల్లడించింది. అలాగే మహిళ విభాగంలోనూ అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ఏకంగా ఇండియా నుంచి నలుగురు ఎంపిక కావడం విశేషం. ఓపెనర్‌గా స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ, వికెట్ కీపర్‌గా రిచా ఘోష్, బౌలర్ల విభాగంలో రేణుకా సింగ్‌కు అవకాశం లభించింది. మహిళల జట్టుకు న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్‌ను కెప్టెన్‌గా ఎంపికచేశారు.
పురుషుల విభాగంలో ఓపెనర్లుగా కెప్టెన్ జాస్ బట్లర్ (ఇంగ్లాండ్, వికెట్‌కీపర్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)లను ఎంపిక చేసిన ఐసీసీ మేనేజ్‌మెంట్.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ (భారత్), ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)కు అవకాశం కల్పించింది. ఆపై ఆల్‌రౌండర్ల కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), హార్ధిక్ పాండ్యా (భారత్), సామ్ కరన్ (ఇంగ్లాండ్)లను తీసుకుంది. స్పిన్నర్‌గా వానిందు హసరంగ (శ్రీలంక), పేసర్లుగా హరీస్ రౌఫ్ (పాకిస్తాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్)లను ఎంపిక చేసింది.
Mens
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సూపర్ పెర్ఫామెన్స్‌తో మెప్పించాడు. పాకిస్థాన్ జరిగిన మ్యాచ్‌లో 82 రన్స్ చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. అలాగే ఈ మెగాటోర్నీలో మరో మూడు అర్ధశతకాలతో మొత్తం 296 రన్స్ చేసి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే నిరుడు సూర్యకుమార్ కూడా మంచి ఫామ్ కనబర్చాడు. 2022లో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక రన్స్ (1,164) చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. అలాగే టీ20 వరల్డ్ కప్‌లోనూ 189.69 స్ట్రైక్ రేట్‌తో 239 రన్స్ చేసి ఔరా అనిపించాడు. అలాగే టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇక గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ తర్వాత నేషనల్ టీమ్‌లోనూ దుమ్మురేపాడు. ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో గతేడాది 607 రన్స్ చేసి 20 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు
పురుషుల అత్యుత్తమ టీ20 జట్టు-2022
జాస్ బట్లర్ (కెప్టెన్, ఇంగ్లాండ్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ (ఇండియా), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), సికిందర్ రాజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (ఇండియా), సామ్ కరన్ (ఇంగ్లాండ్), హసరంగ (శ్రీలంక).
మహిళల అత్యుత్తమ టీ20 జట్టు-2022
స్మృతి మంధాన (ఇండియా), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), సోఫీ డివైన్ (న్యూజిలాండ్, కెప్టెన్), ఆష్ గార్డెనర్ (ఆస్ట్రేలియా), తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దర్ (పాకిస్తాన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (ఇండియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్), ఇనోకా రణవీర (శ్రీలంక), రేణుకా సింగ్ (ఇండియా)
Womens’