ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. 2023లో గుజరాత్‌ను నడిపించిన హార్దిక్ పాండ్యా ఈసారి ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్‌ను హార్దిక్ వీడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. హార్దిక్ వెళ్లినా…
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 షూటింగ్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనకు వడ్డించిన ఆహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెట్లో ఉన్న వ్యక్తులపై మండిపడ్డాడు. వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో చీలమండ గాయం బారిన పడిన పాండ్యా.. టోర్నీ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంటూ, తన సోదరుడు కృనాల్, సహచరుడు ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్)తో…
Sunil Gavaskar React on Rohit Sharma Mumbai Indians Captaincy: ఐపీఎల్ 2024 ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. దాంతో సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్ అభిమానులు ముంబై మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆపై కోచ్ మార్క్ బౌచర్ వ్యాఖ్యలు, రోహిత్ సతీమణి రితికా సోషల్ మీడియాలో పోస్టులు…
Rohit Sharma wife Ritika Sajdeh Comment On Mark Boucher’s Interview over MI Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై.. 2013 నుంచి కెప్టెన్‌గా వ్యవహిరించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. హార్దిక్‌కు ముంబై జట్టు పగ్గాలు అప్పగించడంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో రోహిత్ ఫాన్స్…
Hardik Pandya Resumes Bowling Practice Ahead Of IPL 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి అర్ధతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ చీలమండకు గాయమైంది. హార్దిక్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. ఫిట్నెస్ సాధించిన అతడు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. బరోడా క్రికెట్ స్టేడియంలో నెట్స్‌లో చెమటోడ్చాడు. బౌలింగ్ చేస్తున్న వీడియోను పాండ్యా తహ ఎక్స్ ఖాతాలో…
మరో 6 నెలల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అయితే.. ఈ ప్రపంచకప్‌కు భారత కెప్టెన్ ఎవరు? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ టీ20ల్లోకి తిరిగి వచ్చాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా టీ20లకు సారథ్య బాధ్యతలు వహించాడు. ఈ క్రమంలో.. కెప్టెన్సీపై టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Hardik Pandya: ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులను సందర్శించారు. అక్కడ ఉన్న సుందరమైన బీచుల్లో ఆయన పర్యటించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. లక్షదీవుల్లో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు.
Rohit Sharma praised by Aakash Chopra: ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ అభిమానులకు వరుస షాక్స్ ఇస్తోంది. ముందుగా గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకుని.. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో అతడిని నియమించింది. దాంతో పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం కోసం రోహిత్‌ను తప్పించడం సరికాదని సోషల్ మీడియాలో ఫాన్స్ మండిపడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.…
IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కి కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మను పక్కన పెట్టింది. వారసత్వ నిర్మాణంలో భాగంగా, భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేసేందుకే ఎంఐ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Ajay Jadeja Wants Suryakumar Yadav As Captain Of Mumbai Indians: ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ వయసు 36 ఏళ్లు కాబట్టి.. భవిష్యత్తు కెప్టెన్ కోసం ముంబై ప్రాంచైజీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్ 2024 మినీ వేలంకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడ్ చేసుకుంది. వచ్చే సీజన్ కాకపోయినా.. ఆ తర్వాతి ఎడిషన్లలో హార్దిక్ జట్టు పగ్గాలు…