Hardik Pandya stepbrother Vaibhav Pandya arrested: టీమిండియా క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు కోట్ల రూపాయలు మోసపోయారు. పాండ్యా సోదరుల కజిన్ (వరుసకు సోదరుడు) అయిన వైభవ్ పాండ్యా.. పార్ట్‌నర్‌షిప్ బిజినెస్‌లో వీరికి దాదాపు రూ.4.3 కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ ఘటనపై హార్దిక్, కృనాల్ ఫిర్యాదు చేయడంతో.. ముంబై పోలీసులు వైభవ్ పాండ్యాను అరెస్ట్ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే…
2021లో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు.. తమ కజిన్ వైభవ్ పాండ్యాతో కలిసి పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ బిజినెస్‌లో హార్దిక్, కృనాల్‌కు చెరో 40 శాతం చొప్పున పెట్టుబడులు ఉండగా.. 20 శాతం వాటా వైభవ్‌కు ఉంది. రోజువారీ కార్యకలాపాలను వైభవ్ చూసుకున్నాడు. లాభాలను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితం పాండ్యా సోదరులకు తెలియకుండా.. వైభవ్ సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని మొదలెట్టాడు. దీంతో భాగస్వామ్యంతో పెట్టిన బిజినెస్‌కు లాభాలు తగ్గి.. రూ.3 కోట్ల మేర నష్టం వచ్చింది.
Also Read: Adam Zampa-IPL 2024: మ్యాచ్‌లు ఆడలేను.. ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్!
అంతేకాకుండా వైభవ్ పాండ్యా తన లాభాల వాటాను 20 శాతం నుంచి 33 శాతానికి రహస్యంగా పెంచుకున్నాడు. భాగస్వామ్య సంస్థ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బును తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. మొత్తంగా దాదాపు రూ.4.3 కోట్లు పాండ్యా సోదరులను వైభవ్ మోసగించాడు. ఈ విషయం తెలిసిన పాండ్యా సోదరులు.. వైభవ్‌ను నిలదీశారు. పరువు తీస్తానంటూ వైభవ్ బెదిరింపులకు దిగాడు. దీంతో పాండ్యా సోదరులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. బుధవారం (ఏప్రిల్ 10) వైభవ్‌ను అరెస్టు చేశారు.