ఈ ఐపీఎల్ 2024 సీజన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యకు అంతగా కలిసి రాలేదు. రెండు విజయవంతమైన సీజన్లు గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన పాండ్య.. ఆ తర్వాత., ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా తిరిగి వచ్చాడు. ఈ ఛాన్సును కొత్త అధ్యయంగా మలుచుకోవడానికి ప్రయత్నించాడు హార్థిక్ పాండ్య. కాకపోతే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం చాలా దారుణంగా ఆడుతోంది. దీంతో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా పై మరింత ఒత్తిడి జరిగింది. మొదటినుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ కాకుండా హార్దిక్ పాండ్యను చేయడం ముంబై ఫ్యాన్స్ అసలు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వరకు ఈ సీజన్ లో జరిగిన మూడు మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ ఓటమి చూసింది. హార్థిక్ పాండ్య కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో ఉంది. ఈ దెబ్బతో పాండ్య మీద విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
Also read: Maganti Babu: ముఖ పరిచయం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరులో ఎలా నిలబెడతారు?: మాగంటి బాబు
ఇకపోతే హార్థిక్ పాండ్య కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో దెబ్బకి హార్దిక్ పాండ్యని క్రికెట్ ఫ్యాన్స్ మరింతగా రోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో హార్దిక్ పాండ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్ టెండూల్కర్ ను ఇగ్నోర్ చేసినట్లుగా కనబడుతోంది. ఇకపోతే సచిన్ ముంబై ఇండియన్స్ సపోర్ట్ టీంలో ఒక మెంబర్. ఆ వీడియోలో సచిన్ టెండూల్కర్ పిచ్ పై నడుస్తున్న సమయంలో హార్థిక్ పాండే దాని పక్కనే ఉండి ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడుతోంది. అయితే సచిన్ తో కలిసి కెప్టెన్ గా ఉన్న పాండ్య పిచ్ చూడడానికి కాస్త కూడా ఆసక్తి చూపించకపోవడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Also read: Lok Sabha Elections : కాంగ్రెస్ తర్వాత ఐటీ శాఖ పరిధిలో మరో రెండు పార్టీలు
అయితే అదే సమయంలో రోహిత్ శర్మ సచిన్ ను గమనించి ఆయన దగ్గరికి వెళ్లి ఆట గురించి చర్చించాడు. ఇక అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లతీష్ మలింగను కూడా హార్దిక్ పట్టించుకోలేదని ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు టీంని గెలిపించడం చేతకాదు కానీ.. ఇలా ఆటిట్యూడ్ చూపించడానికి మాత్రం ముందుంటాడు అంటూ హార్దిక్ పాండ్యాపై ఘాటు విమర్శలకు దిగారు. తన తోటి ప్లేయర్లు అలాగే సీనియర్లపై కనీస మర్యాద చూపించాల్సిందని మరికొందరు హార్దిక్ పాండ్యాపై విమర్శలు చేస్తున్నారు.
"Hardik Pandya ignored Sachin Tendulkar".pic.twitter.com/dtyjj4rV2A
— 🐐 (@ItsHitmanERA) April 2, 2024