Hanuma Vihari: ఆంధ్ర రంజీ జట్టుకు హనుమ విహారి వీడ్కోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర రంజీ జట్టుకు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పారు. భవిష్యత్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లలో ఆవేదన వెళ్లగక్కాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉందని వెల్లడించారు.
Indian Railway: నిరుద్యోగులకు రైల్వేశాఖ కీలక అలర్ట్
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
2023-24 రంజీ సీజన్లో మొదటి మ్యాచ్ బెంగాల్తో గెలిచిన తర్వాత తనను కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అసోసియేషన్ కోరిందని చెప్పాడు. జట్టులో 17వ సభ్యుల పైన అరవడం కారణమే కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసిందని తెలిపాడు. జట్టులో 17వ సభ్యుడు ఓ రాజకీయ నాయకుడు కుమారుడు అని చెప్పాడు. ఆంధ్ర క్రికెట్ జట్టు పై ఉన్న అభిమానం, క్రికెట్ పై ఉన్న ప్రేమతో ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని విహారి పేర్కొన్నాడు.
గత సీజన్లో కుడి చేతికి దెబ్బ తగిలినప్పటికీ… ఎడమ చేతితో బ్యాటింగ్ చేసిన తనకు అసోసియేషన్ చేసిన అవమానం తట్టుకోలేకపోతున్నానని అన్నాడు. నా ఆత్మ అభిమానాన్ని పోగొట్టుకున్న ఆంధ్ర జట్టులో ఇక ఆడకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఆంధ్ర జట్టును, క్రికెట్ను ఎప్పుడు గౌరవిస్తానని అన్నాడు. ప్రతి సీజన్లో మనం ఎదుగుతున్న విధానాన్ని నేను ఇష్టపడినా.. అసోసియేషన్ మనం ఎదగాలని కోరుకోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశాడు.
PayTM Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ రాజీనామా
2018లో టీమిండియా టెస్టు జట్టులో అరంగేట్రం చేశాడు. విహారి ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో ఓడిపోయే స్థితిలో ఉన్న టీమిండియాను విహారి వీరోచిత పోరాటం చేసి గెలిపించాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. విహారి అత్యధిక స్కోరు 111. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 114 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 53.02 సగటు, 48.54 స్ట్రైక్‌రేట్‌తో 8643 పరుగులు చేశాడు. అందులో.. 23 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. టీమ్‌ఇండియా తరఫున 10 ఇన్నింగ్సుల్లో 5 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్‌లో 27, లిస్ట్ ఏలో 22, టీ20ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!