టీమిండియా వెటరన్ ఆటగాడు.. ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్ హనుమ విహారీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయారు. తాజాగా బీసీసీఐ 2023-2024 గాను ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విహారికి చోటు దక్కలేదు. దీంతో అతడు మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు కష్టమని అంతా భావించారు. కానీ విహారి మళ్లీ భారత జట్టులోకి పునరగమనం చేసే ఇంకా దారులు మూసుకుపోలేదు. ఆస్ట్రేలియాతో జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు భారత జట్టులో హనుమ విహారికీ చోటు దక్కనున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెన్నుగాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో విహారి ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం. కాగా విహారి దేశీవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నారు.
Read Also : Manchu Manoj: మీడియా పై మంచుమనోజ్ చిందులు
రంజీ ట్రోఫీ 2022-2023 సీజన్ లో విహారి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడికి మళ్లీ పిలుపునివ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా టీమిండియా తరుపున ఎన్నో విరోచిత ఇన్సింగ్స్ లు ఆ ఆంధ్రా కెప్టెన్ ఆడాడు. లండన్ వంటి స్పింగ్ పిచ్ లపై అద్భుతంగా ఆడే సత్తా హనుమ విహారికి ఉంది. ఇక ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి స్పందిస్తూ.. శ్రేయస్ అయ్యర్ మా జట్టులో చాలా కీలకమైన ఆటగాడు.. అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరం మాకు పెద్ద ఎదురుదెబ్బ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతడు చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్ గతంలో ఆస్ట్రేలియా వంటి పిచ్ లపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ లో ఆడిన అనుభవం కూడా అయ్యర్ కు ఉంది. అతడి స్థానంలో మరో అనుభవం ఉన్న ఆటగాడితో భర్తీ చేయాలని చూస్తున్నామని తెలిపాడు. మా సెలక్టర్లు హనుమ విహారి పేరును పరిశీలిస్తున్నారు. మే మొదటి వారంలో జరుగనున్న సెలక్షన్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా విహారి చివరగా భారత్ తరపున గతేడాది ఇంగ్లండ్ పై ఆడాడు. అప్పటి నుంచి అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.
Read Also : Bandi sanjay wife: ఎమోషన్స్ లేని ఈ ప్రభుత్వానికి “బలగం” సినిమా చూపించాలి