వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు క్రీడాకారులకు కూడా బలైపోతున్నారని దుయ్యబట్టారు. అందుకు నిదర్శనం హనుమ విహారినేనని అన్నారు. ప్రతిభ, సామర్థ్యాలున్న హనుమ విహారిని కాదని, వైసీపీ నాయకుడి కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పని చేయడం క్రీడాలోకానికే అవమానం అని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ట మసక బారిందని వ్యాఖ్యానించారు. దోపిడీకి ఆలవాలంగా మారిందని పేర్కొన్నారు.
Read Also: Viral Video : అరె ఏంట్రా ఇది.. మంచును కూడా వదలరా..వీడియో వైరల్..
ఏసీఏలో రూ.120 కోట్ల డిపాజిట్లకు బదులు కేవలం రూ.20 కోట్లే ఎందుకు ఉన్నాయి? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారులకు చేయూత అందిస్తే.. జగన్ రెడ్డి హయాంలో క్రీడాకారులు బలి పశువులు అవ్వడం బాధాకరమని తెలిపారు. హనుమ విహారికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి నోరు విప్పాలని కొల్లు రవీంద్ర కోరారు. జాతీయస్థాయి క్రికెటర్ కు అన్యాయం చేసిన సొంత పార్టీ నేతలపై క్రీడాశాఖ మంత్రి రోజా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Bihar: బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు..
ఇదిలా ఉంటే.. సోమవారం ఆంధ్ర రంజీ జట్టుకు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. భవిష్యత్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లలో ఆవేదన వెళ్లగక్కాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉందని వెల్లడించారు.