దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ ఇదివరకు లేఖ రాసింది.
2 People Die Of Suspected H3N2 Virus: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో వందల్లో ఇన్‌ఫ్లుఎంజా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే హెచ్3ఎన్2 కారణంగా పలువురు మరణించారు. కర్ణాటకలోని హసన్ లో తొలి హెచ్3ఎన్2 వైరస్ మరణం నమోదు అయింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రాష్ట్రంలో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.
H3N2 virus Cases: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. కరోనా లక్షణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు హెచ్3ఎన్2 వైరస్ కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి.
H3N2 Virus: దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఓ మహిళ మరణించింది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంది. జనవరి 1 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ కారణంగా మరణించింది. గత వారం కర్ణాటక, హర్యానాల్లో ఇద్ధరు…
దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని మరువకముందే మరో వణికిస్తోంది. దేశంలో వైరస్ హెచ్3ఎన్2 వేగంగా వ్యాపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
Influenza A(H3N2) Cases: దేశవ్యాప్తంగా సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ లక్షణాలతో ఈ వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలిక దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ కారణంగా దేశంలో 2 మరణాలు సంభవించాయి. ‘‘హాంకాంగ్ ఫ్లూ’’గా పిలిచే హెచ్3ఎన్2 వైరస్ వల్ల దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
H3N2 Virus: ఇన్ ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా లక్షణాలు ఉండటంతో జనాలు భయపడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ నగరం జ్వరంతో అల్లాడిపోతోంది. అక్కడ దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాన్పూర్ లోని హాల్లెట్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క రోజులోనే జ్వరంతో, ఇతర జలుబు లక్షణాతో 200 కేసులు వచ్చాయి. వీరిలో 50 మందికి ఆస్పత్రిలో…