Dangerous Virus: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా పంజా.. H3N2 వైరస్‌తో ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Died With H3N2 Influenza In India: కరోనా మహమ్మారి భయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో హెచ్ 3ఎన్ 3 వైరల్ ఇన్ ప్లుయోంజా మరోసారి గుబులు పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తో చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతుండటం కొంత కలవరానికి గురి చేస్తోంది. ప్రాణాంతకం కాదనే నిపుణుల మాటలే ధైర్యాన్ని నింపుతున్న సందర్భంలో ఈ వైరస్ తో మరణాలు సంభవించాయన్న పిడుగు లాంటి వార్త ఇప్పుడు బయటకు వస్తుంది. కొన్ని ఉన్నత అధికారవర్గాల సమచారాం ప్రకారం.. హెచ్ 3ఎన్2 వైరస్ ఇన్ ప్లుయోంజాతో మన దేశంలో రెండు మరణాలు సంభవించాయి. కర్ణాటకలో, హర్యానాలో ఒక్కో మరణం సంభవించినట్లు ఆ వర్గాలు తెలిపారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మార్చి 1వ తేదీన 82 ఏళ్ల హీరే గౌడ్ ఇన్ ప్లుయెంజాతో మరణించినట్లు తెలిపారు.
Summer : మార్చిలోనే 54డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత.. ఇక మే నెల వస్తే
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
దేశవ్యాప్తంగా సుమారు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు రిపోర్ట్ అయినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఎనిమిది హెచ్ 1ఎన్ 1 వైరస్ కేసులను గుర్తించినట్లు తెలిపాయి. కర్ణాటకలో తొలి ఇన్ ప్లుయెంజా మరణం చోటు చేసుకుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్ తరహా లక్షణాలనే పోలిన ఈ ఇన్ ప్లుయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరిగాయి. ఒక వేవ్ తరహాలో చాలా ప్రాంతాలకు ఈ ఇన్ ప్లుయెంగా పాకింది. ఇందులో చాలా వరకు హెచ్3ఎన్2 వైరస్ కేసులే ఉన్నాయి. ఈ వైరస్ ను హాంగ్ కాంగ్ వైరస్ అని కూడా పిలుస్తున్నారు. ఇతర ఇన్ ప్లుయెంజా సబ్ టైపుల్లో ఈ హెచ్ 3ఎన్2 వైరస్ ఎక్కువ మందికి సోకుతు.. హస్పిటళ్ల పాలు చేస్తుంది.
Kim Jong Warning: యుద్ధానికి సిద్ధంకండి.. సైనిక డ్రిల్‌లో కిమ్ హాట్ కామెంట్స్
దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, ఊపిరి ఇబ్బందిగా తీసుకోవడం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు ఈ ఇన్ ప్లుయెంజా బారిన పడిన వారిలో కనపిస్తున్నాయి. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉన్నదని నిపుణులు తెలిపారు. దగ్గు, స్నీజింగ్, సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వైరస్ సులభంగా వ్యాపించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. హెచ్3ఎన్2 వైరస్ ఇతర సబ్ టైప్ ల కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుందని.. అందుకే ఈ వైరస్ సోకడంతో చాలా మంది హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడైంది. గత రెండు.. మూడు నెలలుగా భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ ప్లుయెంజా సోకిన వారిలో దగ్గు, జ్వరం దీర్ఘకాలం కొనసాగుతున్నాయని వివరించారు. దీర్ఘకాలం ఈ లక్షణాలు ఉంటున్నాయని పేషెంట్లు చెబుతున్నారు.
Husband Escaped: ట్రాఫిక్‌లో భార్యని వదిలి భర్త పరార్.. తెరవెనుక ఇంత తతంగమా?
ఈ ఇన్ ప్లుయెంజా నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్నదని ఓ డాక్టర్ తెలిపారు. ఈ వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని.. అది దీర్ఘకాలం కొనసాగుతుందని అన్నారు. అంతేకాదు.. పేషెంట్ రికవరీ అయిన కొందరిలో ఈ లక్షణాలు ఉంటున్నాయని వెల్లడించారు. అయితే ఇది ప్రాణాంతకరమైనదేమీ కాదని క్లినికల్ ట్రయల్ స్పెషలిస్ట్ డాక్టర్లు పేర్కొంటున్నారు. కానీ, శ్వాసకోస సంబంధ సమస్యలతో పలువురు పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరుతున్నారి వివరించారు. కొన్ని లక్షణాలు చాలా వరకు కొవిడ్ ను పోలి ఉంటున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఈ వైరస్ బారిన పడి తమ వద్దకు వచ్చిన పేషెంట్లకు కరోనా నెగిటివ్ అని వచ్చిందని వైద్యులు వెల్లడించారు.
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?