H3N2 Virus: దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఓ మహిళ మరణించింది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంది. జనవరి 1 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ కారణంగా మరణించింది. గత వారం కర్ణాటక, హర్యానాల్లో ఇద్ధరు మరణించారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని హసన్ లో 82 ఏళ్ల వ్యక్తి హెచ్3ఎన్2తో మరణించాడు.
Read Also: Congress: మోదీజీ.. ఆస్కార్ అవార్డుల ఘనత మీదని చెప్పుకోవద్దు..
ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్3ఎన్ 2 వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించింది. మార్చి నెల చివరి వరకు ఈ వైరస్ కేసులు తగ్గుముఖం పడగాయని తెలిపింది. కోవిడ్ లక్షణాలు ఉన్న హెచ్3ఎన్2 ఇన్‌ప్లూఎంజా వల్ల ప్రజలు ఆందోళన చెందున్నారు. శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పరిస్థితిని గమనిస్తున్నట్లు కేంద్ర వైద్యరోగ్య శాఖ తెలిపింది. వ్యాధి బారిన పడినవారు 3 నుండి 5 రోజుల వరకు జ్వరం, నిరంతర దగ్గు, చలి, శ్వాస ఆడకపోవడం, గురక, ముక్కు కారటం, వికారం, గొంతు నొప్పి, శరీర నొప్పి కొన్ని సందర్భాల్లో అతిసార లక్షణాలు కలిగి ఉంటున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వైరస్ సోకిన వ్యక్తులు డాక్టర్లను సంప్రదించకుండా మందులు వాడొద్దని, యాంటీ బయాటిక్స్ వాడకూడదని సలహా ఇచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలని, దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వైరస్ ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుందని తెలిపింది. పిల్లలు, వృద్ధుల్లో, దీర్ఘాకాలిక వ్యాధులు ఉన్న రోగుల్లో ఈ వైరస్ మరింత ప్రమాదకారిగా మారుతోంది.