వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు కోసం వర్కింగ్ క్యాపిటల్ సమస్యను తీర్చాలని కోరుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు.
GVL Narasimha Rao: తెలుగు రాష్ట్రాలలో స్కాంలు జరుగుతున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్నాయని.. ఈ స్కాం ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూరిందనే ప్రచారం జరుగుతోందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గ్రేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలన్నారు. అటు ఏపీలో లేపాక్షి భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్…
GVL Narasimha Rao On TRS MPs Suspension And AP Debts: రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్పెన్షన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై జీవీఎల్ నరసింహా రావు మాట్లాడారు. తీవ్రవాద అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఆందోళన చేశారని.. రాజ్యసభను జరగకుండా అడ్డుకున్నందుకే సభ్యుల్ని సస్పెండ్ చేశారన్నారన్నారు. ఎంతోమంది ఉగ్రవాదుల లింక్స్ హైదరాబాద్‌లో దొరికాయని, ఈ బిల్లుపై చర్చను టీఆర్ఎస్ ప్రతినిధులు ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఇక ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై…
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు జోడించడంపై పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇది అమలాపురంలో విధ్వంసానికి దారి తీసింది.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పుపెట్టేవరకు వెళ్లింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వైసీపీకి అంబేద్కర్ పట్ల ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుగా..? అని ప్రశ్నించారు. అంబేద్కర్ దేశానికి దైవం.. కోనసీమలో హింసను ఖండిస్తున్నామన్న ఆయన.. కోనసీమ ఆందోళనల్లో బీజేపీ నేతలెవ్వరూ పాల్గొనలేదన్నారు. అంబేద్కర్ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి…
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై ప్రధాని మోదీ స్పందించారు. పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ పౌరులకు మరింత ఉపశమనం కలగడంతో పాటు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజలే మొదటి ప్రధాన్యత అని మోదీ వెల్లడించారు. దేశంలో ఉజ్వల యోజన పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లాభపడుతున్నాయని…
టిడ్కో ఇళ్ల కేటాయింపులపై వైసీపీ ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. ఆగస్టు 15వ తేదీలోగా టిడ్కో ఇళ్లను కేటాయించాలని వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ గడువు పెట్టారు.. 30 లక్షల ఇళ్లు ఇస్తున్నామని చెబుతోన్న ప్రభుత్వం అక్కడ ఏం చేయలేదన్న ఆయన.. ఏపీలో టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించిందన్నారు.. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఎలాట్ చేయకుంటే.. బీజేపీ ఉద్యమిస్తుందని ప్రకటించారు.. రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను…
అభివృద్ధి, కరెంట్ కోతలు, నీళ్ల సమస్య, రోడ్ల సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నేతలు.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తుండగా.. కేటీఆర్ చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ అంటున్నారు టీడీపీ నేతలు. ఇక, కేటీఆర్ కామెంట్లపై స్పందించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్…