దళిత క్రిస్టియన్‌లకు ఎస్సీ హోదా కల్పించాలనే వైసీపీ ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం...
ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఇప్పటివరకు ఐటీకి సంబంధించిన పాలసీ తప్ప పని జరగడం లేదని బీజేపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
జీవీఎల్ నరసింహారావు. ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు. 2024 నాటికి ఆయన పదవీ కాలం ముగియనుండగ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి గౌరవ ప్రదమైన ఓట్ బ్యాంక్., గతంలో గెలిచిన చరిత్ర ఉన్న విశాఖపట్టణం మీద కర్చీఫ్ వేశారు. వలస నేతలను ఆదరించే అర్బన్ ఓటర్లను ఆకర్షించడం ద్వారా ప్రజాక్షేత్రంలో గెలవాలనేది జీవీఎల్ ఆలోచన అట. అందుకే కొద్దికాలంగా ఢిల్లీ టు వైజాగ్ షెటిల్ సర్వీస్ చేస్తున్న ఆయన..…
విశాఖ వేదికగా జరుగుతోన్న కాపునాడు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… కాపులు ఒకసారి అధికారంలోకి వస్తే ఇక దిగరని తెలిసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏ సామాజిక వర్గానికి కాపలా కాయాల్సిన అవసరం లేదని అన్ని పార్టీల్లో నేతలు గుర్తించాలన్న ఆయన.. స్టాలిన్ సినిమాలో విలన్‌ను గిరిలో పెట్టినట్టు.. కాపు నాయకులను గిరిగీసి పెట్టారు అంటూ ఆరోపించారు.. అందుకే వంగవీటి రంగా వర్ధంతికి రాకుండా నియంత్రణ చేశారన్న…
GVL Narasimha Rao: రాష్ట్ర విభజన అంశంపై మరోసారి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. రాష్ట్ర విభజనపై ఏపీలో విచిత్ర చర్చ జరుగుతోందని.. గతంలో వైసీపీ కూడా విభజనకు లేఖ ఇచ్చిందని జీవీఎల్ గుర్తుచేశారు. అప్పుడు అలా చేసి.. ఇప్పుడు విభజనను వ్యతిరేకించామని వైసీపీ కొత్త కహానీలు చెబుతోందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు కలవాలనే నినాదం తీసుకురావడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు…