GVL Narasimha Rao On TRS MPs Suspension And AP Debts: రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్పెన్షన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై జీవీఎల్ నరసింహా రావు మాట్లాడారు. తీవ్రవాద అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఆందోళన చేశారని.. రాజ్యసభను జరగకుండా అడ్డుకున్నందుకే సభ్యుల్ని సస్పెండ్ చేశారన్నారన్నారు. ఎంతోమంది ఉగ్రవాదుల లింక్స్ హైదరాబాద్‌లో దొరికాయని, ఈ బిల్లుపై చర్చను టీఆర్ఎస్ ప్రతినిధులు ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఇక ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై మరోసారి పెదవి విప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం గతంలోనే స్పష్టత ఇచ్చిందని.. ప్రత్యేక సహాయం కింద ఏపీకి ఏపీకీ 7 వేల 800 కోట్లు కేంద్రం చెల్లించిందన్నారు.
వైసీపీ అబద్ధాలు చెప్పే అవకాశం లేదన్న జీవీఎల్.. ఏపీ అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. విభజన సమయంలో ఏపీ అప్పు 97 వేల కోట్లు ఉండగా.. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో అది మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం ఏపీ అప్పుడు 3 లక్షల 98 వేల కోట్ల రూపాయలు ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి రెండు ప్రభుత్వాలే కారణమన్నారు. వైసీపీ, టీడీపీ కలిసి.. ఏపీని అప్పుల్లో ముంచెత్తాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించిన జీవీఎల్ నరసింహా రావు.. కార్పొరేషన్ల నిధులు కలిపితే, ఏపీపై అప్పుల భారం మరింత పెరుగుతుందని అన్నారు.