ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయం కొత్త కాదు.. కానీ, మరోసారి కులరాజకీయం తెరపైకి వస్తోంది.. తాము అంటే తామేనని ప్రకటిస్తున్నారు నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందన్న ఆయన.. కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే అని ప్రకటించారు.. ఇక, ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, బీజేపీల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయని చెప్పుకొచ్చారాయన.. భారతీయ జనతాపార్టీది సబ్ కా సత్ సబ్ కా వికాస్…
విజయవాడ లో ప్రజాగ్రహ సభ చాలా పెద్ద సక్సెస్ అయిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ ..వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే లెక్కలేని తనంగా ఉన్న పార్టీలకు నిన్నటి సభ ఒక మేల్కొలుపు లాంటిదని, వైసీపీ పతనంప్రారంభమయిందన్నారు. ఆయా పార్టీ లకు ఓ రకంగా భయం కలిగేలా సభ జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో…
అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు. లేపాక్షి అంటే తెలుగు సంస్కృతికి భారతీయ సంస్కృతికి పవిత్రతకు మారుపేరు. రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి ఆలయాన్ని కానీ దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. లేపాక్షి ఆలయానికి నందికి ఆనుకుని హైవే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం మొండికేసినప్పుడు దాన్ని తానే ఆపానన్నారు. లేపాక్షి ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద చేర్చాలి, అవసరమైతే దీని కోసం నేను పార్లమెంట్లో…
అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శిక్షణ తరగుతలలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని అన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. రాయలసీమలోనే హైకోర్టు ను పెట్టండి అని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చెప్పామని, హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని ఆయన అన్నారు. ఏపీ…
నరసరావుపేట పార్లమెంట్‌పై ఈ మధ్య ఓ నేతకు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. పార్టీలు పక్కనపెట్టి ప్రజాసేవ చేద్దాం రండి అంటూ ఎమ్మెల్యేలను, స్థానికులు కలుపుకొని హల్‌చల్ చేస్తున్నారు. ఉంటే ఢిల్లీలో.. లేదంటే నరసరావుపేటలో.. ఇదే నా టార్గెట్..! నేను మీ వాడినే అంటూ ఊరూరు తిరుగుతున్నారట. ఇంతకీ ఢిల్లీ నుంచి నరసరావుపేటపై ప్రేమ కురిపిస్తున్న నేత ఎవరు? జీవీఎల్ ముందస్తుగా ఇల్లు సర్దుకుంటున్నారా? GVL నరసింహారావు. ఏపీ రాజకీయాలకు ముఖ్యంగా బీజేపీకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం…
ఏపీలో జగన్ పాలనపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని లెంపలేసుకుంటున్న పరిస్థితి వుందన్నారు ఎంపీ సుజనా చౌదరి. అప్రజాస్వామికంగానే అధికార పార్టీ స్థానిక సంస్థలను చేజిక్కించుకుంది.ఏ ఒక్క మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్ధమైంది. తమకు బీజేపీ ఆశీస్సులున్నాయని వైసీపీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.. అదంతా అబద్దం. వైసీపీ మాకు శత్రువు కాదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధి అన్నారు సుజనా చౌదరి.…
ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఏపీ బీజేపీ కోర్ కమిటీని నియమించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలో 16 మందితో కోర్ కమిటీని నియమించింది బీజేపీ అధినాయకత్వం. ఎంపీలైనా సరే తమను కోర్ కమిటీ భేటీలకు పిలవడం లేదని ఇటీవలే అమిత్ షా భేటీలో ఫిర్యాదు చేశారు సీఎం రమేష్, సుజనా చౌదరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించిన కోర్ కమిటీ సభ్యులుగా సీఎం రమేష్, సుజనా తదితరులు వున్నారు.…
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. “ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం” రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద…
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజీల్ ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుందని, కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదని, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పెట్రోల్‌పై 5రూపాయలు, డీజీల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పన్ను తగ్గించాలని కేంద్రం కోరిందని ఆయన తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను తగ్గిస్తే బీజేపీయేతర రాష్ట్రాల్లో పన్ను తగ్గించ లేద న్నారు. ఏపీలో పెట్రోల్ రేట్లు తగ్గించకపోవడం పై…
టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం దృష్టి పెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో, అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. అప్పట్లో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏం ముఖం…