HMPV Virus: చైనాలో ప్రారంభమైన HMPV దేశాన్ని కూడా కలవరపెట్టింది. చైనాలో భారీగా కేసులు నమోదు కావడం, మరోసారి కోవిడ్ మహమ్మారిని గుర్తుకు తెచ్చింది. ఇదిలా ఉంటే, HMPV వైరస్ కేసులు కూడా భారత్‌లో కూడా నమోదు కావడం ఆందోళల్ని పెంచాయి. అయితే, నిపుణులు దీనిని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. Read Also: CM Revanth Reddy : రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు పాఠశాల విద్యలో AI ఆధారిత డిజిటల్ విద్య ఇదిలా…
గుజరాత్ రాష్ట్రంలో గ్యాస్ సిలండర్ పేలిన ఘటనలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మృతిచెందారు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు చెందిన వలస కూలీలు గుజరాత్ రాష్ట్రం ముంద్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు..
Congo fever: గుజరాత్లోని జామ్‌నగర్‌లో 51 ఏళ్ల వ్యక్తి క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం (CCHF)తో మరణించాడు. సాధారణంగా దీనిని ‘‘కాంగో జ్వరం’’గా పిలుస్తుంటారు.
Bomb Threat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈరోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాల అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
Viral Video: గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతూ, సామాన్యుల ఆగ్రహానికి ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును చూడవచ్చు. అందిన సమాచారం మేరకు, ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ఆ అధికారిది పని చేసే కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిని కళ్లెదుట కూర్చోబెట్టి,…
Cyber Fraud Village : ఐదు రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిబ్బంది.. 23 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఈ అరెస్ట్‌ల వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడిస్తూ.. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండటంతో నిందితులను పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో 23 మంది సైబర్ నేరగాళ్ళని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలలో నిందితులు నేరాలకు పాల్పడినట్లు…
Borewell Incident: రోజుల వ్యవధిలో రెండు బోరుబావి సంఘటనలు విషాదంగా మారాయి. ఇటీవల రాజస్థాన్‌లో చేతన అనే 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. 10 రోజుల రెస్క్యూ తర్వాత విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. తాజాగా, గుజరాత్ కచ్‌లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి ఇంద్రా మీనా ఘటన కూడా విషాదంగా మారింది. 33 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీల ప్రయత్నం వృథాగా మారింది.
Borewell Incident: రాజస్థాన్‌లో ఇటీవల బోరుబావిలో పడి మూడేళ్ల బాలిక చేతన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలిక సురక్షితంగా తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. 10 రోజుల రెస్క్యూ తర్వాత బాలిక చనిపోయింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మరవక ముందే మరో బోరుబావి సంఘటన చోటు చేసుకుంది.
Instagram Love: ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలిసీతెలియని వయసులో ప్రేమ, కామం కారణంగా యువత చెడుదోవ పడుతోంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల్ని ఎదురించడం, ప్రేమించిన వారి కోసం వారిని చంపిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియా పరిచయాలు లవ్ ఎఫైర్లకు కారణమవుతున్నాయి. Read Also: Vikarabad: పావురాలతో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు.. ఇదిలా ఉంటే, గుజరాత్‌లో 10 ఏళ్ల బాలిక 16…
గుజరాత్లోని కచ్‌లో భూకంపం సంభవించింది. ఈరోజు సాయంత్రం 4.37 గంటలకు ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం కచ్‌లోని దుధై సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ (ISR) ఈ విషయాన్ని వెల్లడించింది.