ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్‌లో పర్యటించారు. అయితే ముందుగా సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేసింది. ఆ సమయంలో హఠాత్తుగా ఓ బాలుడు(17) సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. దీన్ని గమనించిన పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ వెంటనే సైక్లింగ్ చేస్తున్న బాలుడిని అడ్డుకుని చితకబాదాడు. తల మీద, ముఖంపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగనుంది. మాజీ పీసీసీ అధ్యక్షులు, గుజరాత్ పీసీసీ సీనియర్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ నిర్మించిన వంటారా జంతు రక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం వివిధ జంతువులతో మోడీ సరదాగా గడిపారు.
భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను మోడీ పోస్టు చేశారు. ఇక గుజరాత్‌లోని మూడు రోజుల పర్యటన సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని గిర్ అడవుల్లో మోడీ సపారీ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నేడు సోమనాథ్ ఆలయాన్ని మోడీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, శివుడికి జలాభిషేకం నిర్వహించారు. ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వచ్చారు. తన పర్యటనలో రెండవ రోజు సోమనాథ్ ఆలయానికి చేరుకుని, అక్కడ ప్రార్థనలు చేసి, ఆ తర్వాత జునాగఢ్‌లోని ససంగీర్‌కు బయలుదేరారు. ప్రధానమంత్రి ఈ రాత్రి జునాగఢ్‌లోని సింగ్ సదన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. సోమవారం ఉదయం…
మహా శివరాత్రి ఉత్సవాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. పరమ శివున్ని ప్రసన్నం చేసుకునేందుకు శివయ్య భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే శివాలయాలను పూలు, మామిడాకుల తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. మహా శివరాత్రి వేళ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగనున్నాయి. భక్తులు ఉపవాసాలు, జాగారాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు శివయ్యపై తమ భక్తిని వినూత్నరీతిలో చాటుకుంటున్నారు. ఇదే రీతిలో గుజరాత్ లోని భక్తులు శివలింగాన్ని రుద్రాక్షలతో రూపొందించారు. వందలు,వేలు కాదు ఏకంగా…
Pakistan : పాకిస్తాన్ జైళ్లలో నిర్బంధించబడిన మత్స్యకారులు తమ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది జాలర్లు తమ శిక్షను పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ వారిని విడుదల చేయలేదు.
Matrimonial Sites: గుజరాత్‌కి చెందిన 26 ఏళ్ల యువకుడిని వసాయి ఈస్ట్‌లోని వాలివ్ పోలీస్ బుధవారం అరెస్ట్ చేసారు. అతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా పరిచయం అయిన 15కి పైగా మహిళలను గత రెండున్నర సంవత్సరాలుగా పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా, ఆర్థికంగా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్‌కు చెందిన హిమాంషు యోగేశ్‌భాయ్ పంచాల్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో తనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ డివిజన్లో…
Principal Slaps Teacher: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాలలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాఠశాల ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్ తన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రాజేంద్ర పర్మార్‌ను 18 సార్లు చెంపదెబ్బ కొట్టిన వీడియో సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ వివాదం పాఠశాలలో గణితం, సైన్స్ పాఠాలు బోధిస్తున్న రాజేంద్ర…