Indian Railways : రైలులో ప్రయాణించే వారు తప్పని సరిగా రైల్వే నిబంధనలు పాటించాలి. కొంతమంది ప్రయాణికులు మద్యం సేవించి రైలులో ప్రయాణించడం... లేదా కొన్నిసార్లు ప్రయాణికులు రైలులో తమతో పాటు మద్యం తీసుకొని ప్రయాణించడం చాలాసార్లు కనిపిస్తుంది.
Supreme Court: ‘మోడీ ఇంటిపేరు’ వివాదంలో రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ కోర్టు న్యాయమూర్తితో పాటు గుజరాత్ రాష్ట్రంలో కింది కోర్టుల్లో పనిచేస్తున్న 68 మంది న్యాయమూర్తులకు ప్రమోషన్లు ఇవ్వడంపై స్టే విధించింది. సూరత్ కోర్టు న్యాయమూర్తి హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ కూడా ఇందులో ఉన్నారు. వీరి ప్రమోషన్లు చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. హరీష్ హస్ముఖ్ భాయ్ తో సహా 68 మంది న్యాయమూర్తులు జిల్లా జడ్జీ క్యాడర్ కు ప్రమోట్…
The Kerala Story: వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన ‘‘ ది కేరళ స్టోరీ’’ సినిమా థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఈ సినిమాపై నిషేధం విధించింది. ఇక తమిళనాడు ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో సినిమా ప్రదర్శనను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినిహాయింపులను కల్పించాయి. కొన్ని చోట్ల మహిళలకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తున్నారు.
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయం నుండి తన భార్య తిరిగి వచ్చేందుకు ఎస్‌యూవీ వాహనంలో వేచి ఉన్న స్థానిక బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.
మోడీ ఇంటిపేరు కేసులో విధించిన శిక్షపై స్టే ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. రాహుల్ పిటిషన్ పై ( ఏప్రిల్ 27 ) గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.
సాధారణ జీవనం గడిపే స్వీపర్ 16 కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవచ్చా.. ఇది వినడానికి తమాషాగా ఉన్నా.. వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఓ స్వీపర్‌కు రూ. 16కోట్ల రుణం చెల్లించాలంటూ ఓ బ్యాంకు నోటీసులు పంపించింది. ఈ నోటీసు స్వీపర్ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది.
ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
గోద్రా అల్లర్ల కేసుకు సంబంధించిన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2002లో గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టిన 8 మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులకు కోర్టు నుండి ఉపశమనం లభించింది. ఈ దోషులందరికీ 17 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.
గుజరాత్‌లోని నరోడా గ్రామ్ ఊచకోత కేసులో హ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో నరోదా గామ్‌లో 11 మంది చనిపోయారు. ఈ కేసులో గుజరాత్ మంత్రి మాయా కొద్నానీ నిందితురాలిగా ఉన్నారు.
గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ ఇటాలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్‌లో గుజరాత్ ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గోపాల్ ఇటాలియాను సూరత్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.