2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో మొత్తం 11 మంది దోషులకు గత సంవత్సరం గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై బానో నిందితుల విడుదలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వరుస పిటిషన్‌లపై సుప్రీంకోర్టు తుది విచారణను ఆగస్టు 7న తుది వాదనలు వింటామని తెలిపింది. న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు ముగిశాయని.. దోషులందరికీ నేరుగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
Read Also: Gangula Kamalakar : మిడ్ మానేర్ నీటిని విడుదల చేసిన మంత్రి గంగుల
ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రతివాదులందరికీ అన్ని కేసులలో నోటీసులు అందించామని వారు తెలిపారు. ఆగస్టు 7న తుది విచారణకు ఈ అంశాన్ని జాబితా రెడీ చేశాము.. అన్ని పక్షాలు సంక్షిప్త వ్రాతపూర్వకంగా సమర్పించాలని.. దానికి సంబంధించిన ఫైల్ రెడీ చేయాలని పేర్కొన్నారు. అయితే, గత ఏడాది ఆగస్టు 15న సత్ప్రవర్తన కింద గుజరాత్ ప్రభుత్వం మొత్తం 11 మంది దోషులకు జైలు నుంచి రిలీజ్ చేసింది. దీంతో నిందితుల విడుదలపై సవాల్ చేస్తూ బిల్కిస్ బానో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Nandita Swetha: చిట్టిపొట్టి బ్లాక్ గౌనులో నందితా శ్వేతా హాట్ ట్రీట్.. ఫొటోలు చూశారా?
బిల్కిస్ బానో అభ్యర్థనతో పాటు, సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ, స్వతంత్ర పాత్రికేయురాలు రేవతి లాల్, లక్నో యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మ సహా పలు ఇతర ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా కూడా నిందితుల విడుదలకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశారు. గోద్రా రైలు దహనం సమయంలో జరిగిన అల్లర్ల నుంచి తప్పించుకుని వెళ్తున్న బానో ఐదు నెలల గర్భిణిగా ఉంది.. అయినా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అల్లర్లలో మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులలో, ఆమె మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.