Nose Typing: ముక్కుతో టైపింగ్ చేసి రికార్డు సృష్టించిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంగ వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోలేదు ఓ యువకుడు. సవాళ్లను అధిగమించి తనలోని సత్తా చాటాలని అనుకున్నాడు. ఆ సంకల్ప బలంతోనే రికార్డు సృష్టించాడు. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన స్మిత్ చాంగెలా చిన్నప్పటి నుంచి న్యూరోపతితో బాధపడుతున్నాడు. అయితే, ముక్కుతో ఫోన్ లో టైప్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే వైకల్యం ఎన్నటికీ అడ్డురాదని స్మిత్ నిరూపించాడు.
Read Also: Baby : కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్న మేకర్స్..?
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
రాజ్ కోట్ లో లో నివాసం ఉంటున్న స్మిత్ చాంగెలా.. చిన్నప్పటి నుంచి నరాలకు వచ్చే వ్యాధితో సఫర్ అవుతున్నాడు. అందువల్ల అతడు మొబైల్ ఫోన్ ను చేత్తో టైప్ చేస్తుంటే నొప్పులు ఎక్కువగా వచ్చేవి.. దీంతో లాక్ డౌన్ టైంలోఅతడు.. ముక్కుతో ఫోన్లో టైపింగ్ చేశాడు. మొదట్లో స్మిత్ కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఇప్పుడు వేగంగా టైపింగ్ చేస్తున్నాడు.
Read Also: TFCC Elections: సంతోషపడాలో, సిగ్గుపడాలో తెలియట్లేదు.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై తమ్మారెడ్డి ఫైర్
అయితే, ఇటీవలే ఇండియా బుక్ ఆఫ్ రికార్టులో స్థానం దక్కించుకున్నట్లు స్మిత్ చాంగెలా చెప్పుకొచ్చాడు. ఒక్క నిమిషంలో 151 అక్షరాలు/ 36 పదాలు టైప్ చేశానని అతడు వెల్లడించాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు పత్రం కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాడు. నాలాంటి దివ్యాంగ యువకులు దేశంలో ఎంత మందో ఉన్నారు.. వారు కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట ఒత్తిడికి లోనవుతారు.. అప్పుడు వారేం పనిచేయలేక బాధపడుతుంటారు.. అలా కాకుండా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి అని స్మిత్ తెలిపాడు. వారు కూడా వినూత్నంగా ఆలోచించి విజయం సాధించాలి అంటూ స్మిత్ చాంగెలా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బీకాం చదువుతూ.. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతూ.. ఎందరో యువకులకు స్మిత్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
తాజావార్తలు
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!