2022లో ఐపీఎల్‌లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో మొదటి సీజన్‌లోనే టైటిల్ సాధించి అనూహ్య విజయం సాధించింది. ఈ జట్టు ఇప్పుడు కొత్త యజమానిగా టోరెంట్ గ్రూప్‌ను పొందనుంది. ఇది రాబోయే ఐపీఎల్ సీజన్ ముందు జరుగుతుందని సమాచారం.. 2022లో ఈ జట్టును CVC క్యాపిటల్ పార్టనర్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం.. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ టోరెంట్ గ్రూప్ 67 శాతం వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది.
పోంజీ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని జనాలను మోసం చేసి.. ఏకంగా రూ.6 వేల కోట్లను బీజెడ్ గ్రూప్ పోగేసింది. ఈ స్కామ్‌లో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అయితే పోంజీ స్కామ్‌లో గుజరాత్ సీఐడీ సమన్లు పంపే అవకాశం ఉన్న నలుగురు గుజరాత్ టైటాన్స్ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. త్వరలోనే…
IPL 2025 GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కి ముందు గుజరాత్ టైటాన్స్ (GT) పార్థివ్ పటేల్‌ను తమ సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్‌ను నియమించారు. అతను గతంలో ముంబై ఇండియన్స్ (MI)కి స్కౌట్‌గా, ముంబై ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇంతకు ముందు అతను చాలా జట్లతో కలిసి ఐపీఎల్ ఆడాడు. ఈ సందర్బంగా గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేస్తూ.. టైటాన్స్ రాబోయే…
టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి షమీని వదిలేందుకు సిద్దమైందని సమాచారం. గుజరాత్ రిటైన్ లిస్టులో షమీ పేరు లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చీలమండ గాయం కారణంగా ఏడాదికి పైగా షమీ ఆటకు దూరమవడంతోనే గుజరాత్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహహ్మద్ షమీ చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాదిలో ఒక్క…
ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురిసినప్పటికీ.. ఉప్పల్ స్టేడియం స్టేడియం పరిసరాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొద్దిసేపు వర్షం ఆగినప్పటికీ.. మళ్లీ కురుస్తూనే ఉంది. దీంతో.. ఉప్పల్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్లో వర్షం నీరు ఇంకా నిలిచి ఉంది. ఔట్ ఫీల్డ్లో నీళ్ళు పూర్తిగా పోవాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు.. మ్యాచ్ రద్దు అయితే ఒక పాయింట్ పొంది సన్…
ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు దంచికొట్టింది. ఈ క్రమంలో.. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే పడింది. దీంతో.. స్టేడియం సిబ్బంది పిచ్ తో పాటు గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి కవర్ చేశారు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గగా.. కవర్లను తీసేశారు. అయితే.. గ్రౌండ్ లో ఉన్న నీటిని తీసేయడానికి సిబ్బంది…
నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. కానీ.. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలేలా ఉంది. హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం కురుస్తుంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతుంది. ఈ క్రమంలో.. ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు.. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్కు వెళ్లాలనుకున్న సన్ రైజర్స్ టీమ్కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. మరోవైపు.. ఉప్పల్ పరిసరాల్లో…
Gujarat Titans Out From IPL 2024 Playoffs Due To Rain: ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ఉన్న గుజరాత్.. సోమవారం నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడాల్సి ఉండగా.. ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్ ఆరంభానికి ముందే మొదలైన వర్షం.. రాత్రి 10 గంటలు దాటినా ఆగలేదు. దాంతో ఆట సాధ్యం కాలేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌కు తుది…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కాసేపు వర్షం ఆగినప్పటికీ.. తిరిగి మళ్లీ ప్రారంభంకావడంతో రద్దు అయింది. ఈ క్రమంలో.. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది.