ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు దంచికొట్టింది. ఈ క్రమంలో.. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగానే పడింది. దీంతో.. స్టేడియం సిబ్బంది పిచ్ తో పాటు గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి కవర్ చేశారు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గగా.. కవర్లను తీసేశారు. అయితే.. గ్రౌండ్ లో ఉన్న నీటిని తీసేయడానికి సిబ్బంది శ్రమించారు. అయితే కాస్త ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ, మళ్లీ వర్షం కురుస్తుంది.
Read Also: Nagababu: అల్లు ఆర్మీ దెబ్బ.. ట్విట్టర్ డీ యాక్టివేట్ చేసిన నాగబాబు!
దీంతో.. టాస్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా.. మ్యాచ్ ను చూసేందుకు స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే వర్షం పడుతుండటంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లేఆఫ్స్కు వెళ్లే అవకాశాలు మరింత బలమైతాయి. ఒకవేళ.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగకపోయినా ఎస్ఆర్హెచ్ టీమ్కు ఒక పాయింట్ వస్తుంది. దీంతో 15 పాయింట్లతో ప్లేఆఫ్స్కు వెళ్తుంది. మరోవైపు.. తర్వాత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఉంది. ఆ మ్యాచ్లో కనుక గెలిస్తే.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి వెళ్తుంది.
Read Also: Health Tips : ఈ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?