ఐపీఎల్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. చివరి వరకు పోరాడి ఓడిపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో భాగంగా తొమ్మిదవ మ్యాచ్ శనివారం గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో.. జట్టుకు మరింత బలం చేకూరనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో శనివారం (మార్చి 29) జరిగే మ్యాచ్ నంబర్-9లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్‌లో గుజరాత్ తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్…
2017లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ కుడిచేతి ఆల్ రౌండర్. ఇప్పటివరకు అతను ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ప్రవేశపెట్టిన తర్వాత.. 22 మ్యాచ్‌లలో అతనికి కేవలం 9 మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. 59 శాతం మ్యాచ్‌లలో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 11 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది. 244 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో గుజరాత్.. 232 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఆట మొదలయ్యాక ఓపెనర్ ఎవరనే విషయం తెలుస్తుందన్నాడు. బట్లర్ వంటి ఆటగాడు ఏ స్థానంలో అయినా ఆడదానికి సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. గుజరాత్ జట్టు పూర్తి ఫిట్‌గా ఉందని, ఎటువంటి గాయాలు లేవని గిల్ వెల్లడించాడు. నేడు పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30కు…
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాకపోయినా.. తన ప్రదర్శనపై దృష్టి సారించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో 7 సంవత్సరాల పాటు ఆడిన ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. తన కొత్త జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత సిరాజ్ ఐపీఎల్ 2025 సీజన్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను…