IPL 2025 GT: బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్ పటేల్‌ను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కి ముందు గుజరాత్ టైటాన్స్.
- పార్థివ్ పటేల్‌ను తమ సహాయక సిబ్బందిలో.
- బ్యాటింగ్ & అసిస్టెంట్ కోచ్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కి ముందు గుజరాత్ టైటాన్స్ (GT) పార్థివ్ పటేల్‌ను తమ సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్‌ను నియమించారు. అతను గతంలో ముంబై ఇండియన్స్ (MI)కి స్కౌట్‌గా, ముంబై ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇంతకు ముందు అతను చాలా జట్లతో కలిసి ఐపీఎల్ ఆడాడు. ఈ సందర్బంగా గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేస్తూ.. టైటాన్స్ రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతోంది. పార్థివ్ జట్టు బ్యాట్స్‌మెన్స్ కు కీలక పాత్ర పోషిస్తాడు. అతను యువ ప్రతిభకు మార్గనిర్దేశం చేయడం, కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేయడం, వారి అభివృద్ధికి దోహదపడటం వంటి వాటికి ప్రసిద్ధి చెందాడు. ఇకపోతే, గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విఫలమైంన సంగతి తెలిసిందే.
Read Also: JIO Data Recharge: జియో కస్టమర్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.11కే 10జిబి డేటా
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఐపీఎల్ 2024లో, గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో 5 మ్యాచ్‌లను గెలచి, 7 మ్యాచ్లలో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయితే , ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. పార్థివ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ , కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో సహా 6 జట్లకు ఆడాడు. అతను ఐపీఎల్ 2020లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఉన్నాడు. కానీ, అతనికి ఏ మ్యాచ్‌నూ ఆడే అవకాశం రాలేదు. అతను 139 IPL మ్యాచ్‌లలో 22.6 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Read Also: MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?
భారతదేశం తరపున 25 టెస్టుల్లో 31 సగటుతో 934 పరుగులు చేసిన పార్థివ్ డిసెంబర్ 09, 2020న రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను టెస్టుల్లో 6 హాఫ్ సెంచరీలు చేశాడు. అందులో 71 అతని అత్యధిక స్కోరు. భారత్ తరఫున అతను 38 వన్డేల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 736 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 95. ఇక అతను కేవలం 2 T-20 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అందులో అతను 36 పరుగులు చేశాడు.
https://twitter.com/gujarat_titans/status/1856635530374676744
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!