ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో భాగంగా తొమ్మిదవ మ్యాచ్ శనివారం గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్న ముంబై.. ఈ మ్యాచ్ లో గెలువాలని చూస్తోంది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కూడా తమ మొదటి విజయంపై కన్నేసింది.
Read Also: Black Magic: సంతానం కోసం నరబలి.. వ్యక్తి తల నరికి, హోలీ మంటల్లో మొండం దహనం..
ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాయి. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో.. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా తొలి మ్యాచ్‌కి దూరంగా ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. అతని నాయకత్వం ముంబైకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
Read Also: ABD: జట్టు ఇప్పుడు సరైన బ్యాలెన్స్‌గా ఉంది.. ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఉంది
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.